Truecaller New Features : ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్లు.. ఇకపై వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను చూడొచ్చు.. ఎలా చెక్ చేయాలో తెలుసా?

Truecaller New Features : ట్రూకాలర్ (TrueCaller) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ట్రూకాలర్ అధీకృత ప్రభుత్వ అధికారుల నెంబర్లను గుర్తించడానికి యూజర్లను అనుమతించనుంది. ఈ మేరకు ట్రూకలర్ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది.

Truecaller New Features : ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్లు.. ఇకపై వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను చూడొచ్చు.. ఎలా చెక్ చేయాలో తెలుసా?

Truecaller now shows numbers of verified government officials and services, here is how it works

Truecaller New Features : ట్రూకాలర్ (TrueCaller) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ట్రూకాలర్ అధీకృత ప్రభుత్వ అధికారుల నెంబర్లను గుర్తించడానికి యూజర్లను అనుమతించనుంది. ఈ మేరకు ట్రూకలర్ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ట్రూకాలర్‌లో ధృవీకరించిన ప్రభుత్వ అధికారులు లేదా సర్వీసుల సంఖ్యలతో యాప్‌కి డిజిటల్ డైరెక్టరీ (Digital Directory)ని యాడ్ చేసింది. ప్రభుత్వం, అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి నేరుగా సమాచారం పొందినట్లు కంపెనీ పేర్కొంది. గుర్తు తెలియని నంబర్‌లను గుర్తించడం కోసం చాలామంది (Truecaller)ని వినియోగిస్తుంటారు.

తమకు వచ్చిన ఫోన్ కాల్స్ స్పామ్ అవునో కాదో గుర్తించేందుకు వీలుంది. అదేవిధంగా, ట్రూకాలర్ యాప్ ద్వారా ధృవీకరించిన ప్రభుత్వ అకౌంట్లను చాలా సులభంగా గుర్తించవచ్చు. ట్రూకాలర్ యాప్ ఇప్పుడు గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్, బ్లూ టిక్‌ను చూపిస్తుంది. అప్పుడు ఆ నంబర్ వెరిఫై చేసినదిగా గుర్తించవచ్చు. అది స్కామ్ కాదని మీకు తెలియజేసేందుకు ట్రూకాలర్ యూజర్లకు ఇచ్చే సంకేతంగా చెప్పవచ్చు. తద్వారా స్పామ్ మోసాలను తగ్గించడంలో ఈ ఫీచర్ సాయపడుతుంది.

Read Also : Truecaller : గూగుల్ కొత్త రూల్.. కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగించిన ట్రూకాలర్ యాప్..!

ఎందుకంటే.. స్కామర్లు ప్రభుత్వ అధికారుల పేరుతో కాల్ చేస్తారు. అలా యూజర్ల డబ్బును కాజేస్తుంటారు. ట్రూకాలర్ కొత్త ఫీచర్ ద్వారా ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ల పేరును మోసగించే స్కామర్‌ల నుంచి యూజర్లను రక్షిస్తుంది. అంతేకాదు.. ప్రభుత్వ ప్రతినిధులకు పబ్లిక్ యాక్సెస్‌ను క్రమబద్ధీకరించడంలో సాయపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ట్రూకాలర్ 240 మిలియన్లకు పైగా భారతీయ యూజర్లకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుందని ఆశిస్తున్నామని Truecaller బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Truecaller now shows numbers of verified government officials and services, here is how it works

Truecaller now shows numbers of verified government officials and services, here is how it works

వివిధ సెక్షన్లు, రాష్ట్రాలలో మరిన్ని ధృవీకరించిన నంబర్‌లతో రాబోయే నెలల్లో ఫీచర్‌ను అప్‌డేట్ చేస్తామని కంపెనీ వెల్లడించింది.  ప్రస్తుతం, (Truecaller App) సుమారు 20 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను యాడ్ చేసింది. అయితే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్ iOS వెర్షన్‌కి ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

అధీకృత ప్రభుత్వ అధికారుల సంఖ్యలను ఎలా చెక్ చేయాలి? :

మీరు అధీకృత ప్రభుత్వ అధికారుల సంఖ్యను గుర్తించాలంటే.. మీరు వాటిని Truecaller యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. ట్రూకాలర్ యూజర్లు ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అలా కిందికి స్క్రోల్ చేసి, “Government services” ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు దాన్ని ఒకసారి Tap చేస్తే.. మీకు చాలా కేటగిరీలు కనిపిస్తాయి. మీరు సెర్చ్ చేసే సర్వీసు సంఖ్యను కనుగొనడానికి మీరు వాటిలో దేనినైనా Tap చేయవచ్చు.

ట్రూకాలర్ యాప్‌లో మీ రాష్ట్రాన్ని కూడా ఎంచుకోవడానికి అనుమతించే ఆప్షన్ కూడా ఉంది. అంతేకాదు.. (quick dial) సెక్షన్ కూడా ఉంది. ఇందులో ముఖ్యమైన ప్రభుత్వ సర్వీుసుల సంఖ్యలు, పేర్లు ఉంటాయి. సెర్చ్ బార్ (Search Bar) కూడా ఉంది. ఈ సెర్చ్ బార్ ద్వారా మీరు ఏదైనా సెర్చ్ చేసేందుకు ఈజీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ ట్రూకాలర్ యాప్ లో ఈ కొత్త ఫీచర్ యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Telegram Anonymous Number : టెలిగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కొత్త యూజర్లు SIM కార్డు లేకుండానే లాగిన్ కావొచ్చు.. ఎలా పనిచేస్తుందో తెలుసా?