TVS Apache RTR New Bike:పవర్ ప్యాకెడ్ వెర్షన్ ఈ “టీవీఎస్ అపాచీ ఆర్.టీ.ఆర్ 165ఆర్.పీ”

ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్.. తన అపాచీ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆర్.టీ.ఆర్ సిరీస్ లో మరింత పవర్ ఫుల్ బైక్ ను లాంచ్ చేసింది.

TVS Apache RTR New Bike:పవర్ ప్యాకెడ్ వెర్షన్ ఈ “టీవీఎస్ అపాచీ ఆర్.టీ.ఆర్ 165ఆర్.పీ”

Tvs Apache Rtr 165rp

TVS Apache RTR New Bike: ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్.. తన అపాచీ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆర్.టీ.ఆర్ సిరీస్ లో మరింత పవర్ ఫుల్ బైక్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే అపాచీ ఆర్.టీ.ఆర్ సిరీస్ లో 200సీసీ, 160సీసీ బైక్ లు కస్టమర్లకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు సరికొత్తగా 165 ఆర్.పీ వెర్షన్ ను టీవీఎస్ సంస్థ విడుదల చేసింది. ఇప్పుడున్న ఆర్.టీ.ఆర్ 160కే… పవర్ ప్యాకెడ్ వెర్షన్ గా మార్చి సరికొత్త హంగులతో ఈ “165 ఆర్.పీ” బైక్ ను టీవీఎస్ విడుదల చేసింది. ఇందులో “ఆర్.పీ” అంటే “రేస్ పెర్ఫార్మెన్స్”గా టీవీఎస్ చెప్పుకొచ్చింది. ఇక ఈ కొత్త బైక్ ఫీచర్స్ ను చూస్తే….

ఈ కొత్త “165 ఆర్.పీ” బైక్ ను ఆర్.టీ.ఆర్ 160 ప్లాట్ ఫార్మ్ పైనే తయారు చేసింది టీవీఎస్. అయితే ఫీచర్స్ పరంగా, పవర్ పరంగా ఈ బైక్ ఎంతో స్పెషల్ అంటున్నారు. 165సీసీ సామర్ధ్యం కలిగిన ఈ బైక్, 10000 ఆర్పీఎమ్ వద్ద 19.2 పీఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుండగా, 8750 ఆర్పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎం టార్క్ అందుకుంటుంది. ఇక నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజిన్ పైభాగం విశాలంగా ఉండడంతో ఎయిర్ ఇన్ టేక్ 35 శాతం అధికంగా ఉంటుంది. 15 శాతం మేర పెంచిన వాల్వ్ లు పంపింగ్ సిస్టంను మరింత పెంచుతాయి. ఇందులో అమర్చిన క్యామ్ షాఫ్ట్ కూడా వేటికవే బిన్నంగా ఉంటాయి. వీటితో పాటుగా “స్లిప్పర్ అసిస్ట్ క్లచ్, ఇత్తడి పూత కలిగిన చైన్, స్ప్రాకెట్ మరియు వెనుక టైర్ కి 240 ఎంఎం డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఈ బైక్ లో ఉన్నాయి. ఇక ఎక్సటెరియర్ పరంగా చూసుకుంటే.. బైక్ పెయింట్ స్కీం మొత్తం మారిపోయింది. వైట్, బ్లూ డ్యూయల్ టోన్ బాడీతో ఉన్న ఈ బైక్ పై రెడ్ లెటర్స్ తో గ్రాఫిక్స్ వేశారు. వీల్స్ మాత్రం స్పోర్టిరెడ్ కలర్ లో ఉండగా, సీట్ రెడ్, బ్లాక్ డ్యూయల్ టోన్ తో ఉంది. ఈ కొత్త ఫీచర్స్ ను జోడించడంతో బైక్ బరువు 2 కేజీలు పెరిగిందని టీవీఎస్ సంస్థ తెలిపింది.

Also Read: Coffee made in Cooker: ప్రెజర్ కుక్కర్లో “కాఫీ” తయారు: ఈయన “ఐడియా అదుర్స్” గురూ

ఇక చూడగానే ఎంతో ఆకట్టుకుంటున్న ఈ ఆర్.టీ.ఆర్ 165 ఆర్.పీ బైక్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల అయింది. యమహా ఎంటి15, హోండా హార్నెట్ 2.0, బజాజ్ పల్సర్, బైక్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆర్.టీ.ఆర్ 160 అన్ని వర్గాల కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతుండగా, ఈ సరికొత్త 165 ఆర్.పీ బైక్ మాత్రం కొత్తగా స్పోర్ట్స్ బైక్ కొనే వారిని దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేసారు. అయితే ప్రస్తుతానికి 200 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్లలో మాత్రమే ఈ బైక్ ను టీవీఎస్ పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.

Also Read: KFC Chicken Head : కె.ఎఫ్.సీ చికెన్‌లో కోడి తలకాయ, అవాక్కయిన కస్టమర్