Twitter: యూజర్లకు ట్విట్టర్ మరో షాక్.. పరిమితం కానున్న డైలీ ట్వీట్ల సంఖ్య.. కొత్త రూల్స్ అమలు

ఇకపై యూజర్లు రోజువారీగా పరిమితికి మించి ట్వీట్లు చేసే అవకాశం లేదు. అంటే పరిమితి దాటితే ఆ రోజు మళ్లీ ట్వీట్ చేయడానికి లేదు. ఇంకో ట్వీట్ చేయాలంటే మరో రోజు వరకు ఆగాలని సూచించే నోటిఫికేషన్ యూజర్లకు కనిపిస్తోంది.

Twitter: ఇప్పటికే అనేక రకాలుగా యూజర్లను ఇబ్బందిపెడుతున్న ట్విట్టర్ ఇప్పుడు మరికొన్ని షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్విట్టర్ వాడే విషయంలో సరికొత్త రూల్స్ తీసుకొస్తోంది. వీటిలో కొన్నింటిని ఇప్పటికే అమలులోకి తెచ్చింది. యూజర్లకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే కొత్త రూల్స్ అమలు చేస్తోంది.

Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా

దీని ప్రకారం.. ఇకపై యూజర్లు రోజువారీగా పరిమితికి మించి ట్వీట్లు చేసే అవకాశం లేదు. అంటే పరిమితి దాటితే ఆ రోజు మళ్లీ ట్వీట్ చేయడానికి లేదు. ఇంకో ట్వీట్ చేయాలంటే మరో రోజు వరకు ఆగాలని సూచించే నోటిఫికేషన్ యూజర్లకు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లు ఈ తరహా నోటిఫికేషన్లు అందుకుంటున్నారు. ఇది చూసి ట్విట్టర్ యూజర్లు షాకవుతున్నారు. తాజాగా అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం.. యూజర్లు రోజుకు 2,400 కంటే ఎక్కువ ట్వీట్లు చేయడానికి వీలు లేదు. రీ ట్వీట్లను కూడా ట్వీట్లుగానే పరిగణిస్తారు. అంటే ట్వీట్లు, రీట్వీట్లు కలిపి 2,400 దాటకూడదు.

Raja Singh: ఊడిపోయిన కారు చక్రం.. ఎమ్మెల్యే రాజా సింగ్‌కు తప్పిన ప్రమాదం

ఈ పరిమితి మించి, అదనంగా ట్వీట్లు చేయాలంటే మరో రోజు వరకు ఆగాల్సిందే. అలాగే డీఎమ్మెస్ (డైరెక్ట్ మెసేజెస్) కూడా రోజూ 500 మించకూడదు. ట్విట్టర్ మెయిల్ అకౌంట్‌కు సంబంధించి గంటకు నాలుగు మార్పులు మాత్రమే చేయొచ్చు. రోజుకు 400 కంటే ఎక్కువ మందిని ఫాలో అవ్వకూడదు. 5,000 మంది కంటే ఎక్కువ మందిని యూజర్లు ఫాలో అవుతుంటే, వారికి అదనపు నిబంధనలు వర్తిస్తాయి. వీటిలో ఏ పరిమితి దాటినా యూజర్లకు ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది. సాధారణంగా ట్విట్టర్ ఏదైనా కొత్త మార్పు తీసుకొస్తే, దశలవారీగా, నెమ్మదిగా అమలు చేస్తుంది. కానీ, కొత్త రూల్స్‌ను మాత్రం అందరు యూజర్లకు అమలు చేస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు