Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేసుకోండిలా..!

Twitter Blue Tick : మీ అకౌంట్లో ట్విట్టర్ బ్లూ టిక్ బ్యాడ్జ్ (Blue Tick Badge) చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు సాధ్యమే.. ట్విట్టర్ నుంచి వెరిఫికేషన్ చేయించుకోవడమే..

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేసుకోండిలా..!

How To Get Verified On Twitter, Process To Apply For A Verification Badge

Twitter Blue Tick : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ లో బ్లూ టిక్ చూసే ఉంటారు. సాధారణంగా ఈ బ్లూ టిక్ హైప్రొఫైల్ యూజర్లకు మాత్రమే ట్విట్టర్ ఇస్తుంటుంది. అయితే రానురాను ఈ బ్లూ టిక్ ట్విట్టర్ యూజర్ల అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. అందులో భాగంగా ట్విట్టర్ సూచించే మార్గదర్శకాలకు లోబడి ఉండే యూజర్ల అభ్యర్థన్లను ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చేందుకు అనుమతినిస్తోంది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీ ట్విట్టర్ అకౌంట్ కు బ్లూ టిక్ తెచ్చుకోవచ్చు.

మీ అకౌంట్లో ట్విట్టర్ బ్లూ టిక్ బ్యాడ్జ్ (Blue Tick Badge) చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు సాధ్యమే.. మీరు చేయాల్సిందిల్లా ట్విట్టర్ నుంచి వెరిఫికేషన్ చేయించుకోవడమే.. అందుకోసం మీరు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ వెంటనే పూర్తి కాదు.. కొన్నిరోజల సమయం పట్టొచ్చు.. మీ అప్లికేషన్ ధ్రువీకరించడానికి. ఈ క్రమంలో మీ అభ్యర్థనను ట్విట్టర్ తిరస్కరించే అవకాశం కూడా ఉంది. అంత తేలికగా బ్లూ టిక్ వెరిఫై కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఎందుకంటే.. ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందేందుకు కొన్ని అంశాలను నిబంధనలను తప్పనిసరి చేసింది. మీరు ఈ నిబంధనలకు లోబడి ఉంటే బ్లూ టిక్ వెంటనే వస్తుంది. లేదంటే బ్లూ టిక్ పొందడం కష్టమే..

మీ ట్విట్టర్ అకౌంట్ తప్పనిసరిగా గుర్తింపు పొందిన వ్యక్తి లేదా బ్రాండ్‌కు తగినట్టుగా ఉండాలి. లేదంటే మీ బ్రాండ్ కు లింక్ అయి ఉండాలి. ట్విట్టర్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వెరిఫై బ్యాడ్జ్ కోసం మీ అభ్యర్థన రిజెక్ట్ అయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే.. ఒకసారి అప్లికేషన్ రిజెక్ట్ అయితే మరోసారి అప్లయ్ చేయలేరని కాదు.. ప్రస్తుతానికి మీకు బ్యాడ్జ్ వెరిఫై చేయడం సాధ్య పడదు అని అర్థం.. ధృవీకరణ బ్యాడ్జ్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేయవచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. ట్విట్టర్ యూజర్లు మీ అప్లికేషన్ పంపవచ్చు. అయితే, మీ అప్లికేషన్ నెలకు ఒకసారి మాత్రమే పంపే వీలుంది.

Twitterలో వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలాగంటే?
1. మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్‌ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ ఐకాన్ నొక్కండి.
2. మీ అకౌంట్ Settings and privacy > Your Account మళ్లీ నొక్కండి.
3. “Account Information”కి వెళ్లండి.
4. మీకు ధృవీకరణ అభ్యర్థన ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి
5. Apply now బటన్‌ను నొక్కండి. ఆ తర్వాత, ”Verification request” ఆప్షన్ కనిపిస్తుంది.6. ఇక్కడ మీ ఐడెంటీని వెరిఫై చేయమని అడుగుతుంది.

How To Get Verified On Twitter, Process To Apply For A Verification Badge (1)

How To Get Verified On Twitter, Process To Apply For A Verification Badge

Twitter verification badge కోసం ఏ వివరాలు కావాలంటే? :

* Twitter గుర్తింపును ధృవీకరించే 3 పద్ధతులు పాటించాలి.
* అందులో ఒకటి “Official website”. మీరు లేదా మీ సంస్థకు సంబంధించి ఉండాలి.
* మీ Twitter అకౌంట్ సూచించే అధికారిక వెబ్‌సైట్‌కి లింక్‌ను అందించవచ్చు.
* రెండో ఆప్షన్ : ID verification. మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వ్యాలీడ్ అయ్యే అధికారిక ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఫొటోను వాడొచ్చు.
* మూడవది : “అధికారిక ఈ-మెయిల్ అడ్రస్..“మీరు ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. మీరు ఎంచుకున్న Twitter కేటగిరీ డొమైన్‌తో అధికారిక ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది.

Twitter : ఈ కారణాల వల్ల మీ బ్లూ బ్యాడ్జ్ ఎప్పుడైనా రీమూవ్ కావొచ్చు :

* మీరు ప్లాట్‌ఫారమ్‌పై బ్లూ టిక్‌ను తెచ్చుకున్న తర్వాత, మీకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎప్పుడైనా దాన్ని తొలగించే అధికారం Twitter కు ఉంది.
* ట్విట్టర్ సపోర్టు పేజీలో ముందుగానే ట్విట్టర్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. మీ ట్విట్టర్ హ్యాండిల్ పేరును మార్చినప్పుడు బ్లూ టిక్ రిమూవ్ అయిపోతుంది.
* మీ అకౌంట్ కొంత సమయం పాటు ఇన్ యాక్టివ్ లేదా వెరిఫై అయ్యాక మీ అకౌంట్లో ఏవైనా మార్పులు చేస్తే Twitter బ్లూ టిక్ బ్యాడ్జ్‌ను తీసేస్తుందని గుర్తించుకోవాలి.
* ట్విట్టర్ రూల్స్ అతిక్రమించేలా ఉంటే వెంటనే మీ అకౌంట్లో బ్లూ టిక్ రిమూవ్ అవుతుంది.
* మీ అకౌంట్లో చేసిన మార్పులతో “అనర్హత” కేటగిరీ కిందకు వస్తే.. మీరు బ్లూ టిక్‌ను కోల్పోవచ్చు.
* వెరిఫై అయిన వ్యక్తికి దేని ఆధారంగా మీకు బ్లూ టిక్ వచ్చిందో ఆ స్టేటస్ కోల్పోతే.. బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తొలగిస్తుంది.

Read Also : Twitter Warning Label : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఆ పోస్టులకు ఇలా చెక్ పెట్టొచ్చు!