Twitter Character Limit : ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ పెరిగిందోచ్.. ఎక్కడి నుంచి ఎంతవరకు? ఎలన్ మస్క్ మాటల్లోనే..!

Twitter Character Limit : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) క్యారెక్టర్ పరిమితిని పెంచేసింది. ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో ఉన్న 280 క్యారెక్టర్ల నుంచి 4వేల క్యారెక్టర్ల వరకు పరిమితిని పెంచనున్నట్టు ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ ఇటీవలే ధృవీకరించారు.

Twitter Character Limit : ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ పెరిగిందోచ్.. ఎక్కడి నుంచి ఎంతవరకు? ఎలన్ మస్క్ మాటల్లోనే..!

Twitter character limit to increase from 280 to 4000, Elon Musk confirms

Twitter Character Limit : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) క్యారెక్టర్ పరిమితిని పెంచేసింది. ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో ఉన్న 280 క్యారెక్టర్ల నుంచి 4వేల క్యారెక్టర్ల వరకు పరిమితిని పెంచనున్నట్టు ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ ఇటీవలే ధృవీకరించారు. ట్విటర్‌లో అక్షరాలను 280 నుంచి 4000కి పెంచబోతున్నారనేది నిజమేనా?” అని ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ సమాధానమిచ్చారు. ట్వీట్ టెక్స్ట్‌లో మార్పు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుంది అనేది కంపెనీ వివరాలను వెల్లడించలేదు. రాబోయే మార్పుకు Twitterati నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

ట్విట్టర్ క్యారెక్టర్ మొదట్లో 120 అక్షరాలు ఉండేవి.. ఆ తర్వాత 280కి పెరిగాయి. ట్విటర్‌లో ఈ చిన్న ఫార్మాట్‌నే పాయింట్‌గా చెప్పవచ్చు. వావ్…4000? అక్షరాల పరిమితిని 420కి (‘4/20’ సూచనగా) పెంచబోతున్నట్లు ట్విట్టర్ యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన షార్ట్-ఫారమ్ ప్లాట్‌ఫారమ్‌కు 4000 అక్షరాలు చాలా ఎక్కువని అంటున్నారు.

Read Also :  WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మీరు పంపిన మెసేజ్‌‌లను ఒకసారి మాత్రమే చూడొచ్చు..!

IMHOలో 420 బాగానే ఉండేది.. కానీ 500 ఆదర్శంగా ఉంటుందని మరో యూజర్ చెప్పుకొచ్చారు. అక్షరాల పరిమితిని 4000కి పెంచితే ట్విట్టర్ మరో ఫేస్‌బుక్‌గా మారుతుందని కొందరు యూజర్లు ఆందోళనను వ్యక్తం చేశారు. 280 క్యారెక్టర్‌లతో మరో ఫేస్‌బుక్ @ట్విటర్ సమర్థంగా లేదని అన్నారు. ట్వీట్లు 240 పరిమితి ఉండాలని ఒకరు అంటే.. 1,000 అక్షరాలకు పరిమితం అయితే మంచిదని మరో యూజర్ ట్వీట్ చేశాడు.

Twitter character limit to increase from 280 to 4000, Elon Musk confirms

Twitter character limit to increase from 280 to 4000, Elon Musk confirms

తెలియని యూజర్ల కోసంTwitter వాస్తవానికి 140 అక్షరాల పరిమితిని కలిగి ఉంది. 2017లో అక్షర పరిమితి 280కి పెంచింది. దీని కంటే ఎక్కువ పొడవు ఉన్న పోస్ట్‌ల కోసం థ్రెడ్‌లను క్రియేట్ చేసేందుకు Twitter యూజర్లకు అనుమతిస్తుంది. ఇప్పుడు ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ 4000కి పెంచడంతో ట్విట్టర్ థ్రెడ్‌లకు ముగింపు పలికే అవకాశం ఉంది.

ఇంతలో, Twitter వెబ్ వెర్షన్‌లో 8 డాలర్లు, Apple iPhone యూజర్ల కోసం 11 డాలర్లు చొప్పున చెల్లించేలా Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను రీస్టోర్ చేసింది. ఈ సబ్ స్ర్కిప్షన్ ట్వీట్లను ఎడిట్ చేయడంతో పాటు 1080p రిజల్యూషన్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడం, Twitter ప్రొఫైల్స్ కోసం బ్లూ టిక్ అందించే సామర్థ్యాన్ని పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Blue: ఐఫోన్ యూజర్లకు ట్విట్టర్ షాక్.. ‘బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్’ ధర పెరిగే ఛాన్స్?