Twitter CC : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ వీడియోల్లో CC బటన్..!
ప్రముఖ మైక్రోసైట్ బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఆప్షన్ తీసుకొస్తోంది.

Twitter Closed Caption Toggle Is Now Available For Ios, Android Users
Twitter CC Button : ప్రముఖ మైక్రోసైట్ బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఆప్షన్ తీసుకొస్తోంది. Twitter క్లోజ్డ్ క్యాప్షన్ (closed caption) బటన్ ఇప్పుడు iOS, Android యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ట్విట్టర్ యాప్‌లో వీడియోని ప్లే చేస్తున్నప్పుడు.. మీకు క్యాప్షన్లు కనిపిస్తాయి. అయితే ఈ క్యాప్షన్ కావాలా వద్దా అనేది మీదే చాయిస్.. మీకు కావాలనుకుంటే క్యాప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు (On/Off) బటన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. క్లోజ్డ్ క్యాప్షన్ బటన్ ఇప్పుడు iOS, ఆండ్రాయిడ్‌లో అందరికీ అందుబాటులో ఉందని ఓ నివేదిక వెల్లడించింది.
వీడియోలపై క్యాప్షన్లను ఆఫ్/ఆన్ చేయాలంటే మీరుక్యాప్షన్లతో వీడియోలపై “CC” బటన్‌ను ట్యాప్ చేయాలని ట్విట్టర్ సపోర్ట్ హ్యాండిల్లో మైక్రో-బ్లాగింగ్ సైట్ పోస్ట్ చేసింది. ఇటీవల వీడియో ప్లేయర్ కోసం క్యాప్షన్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఇప్పుడు CC అనే ఒక బటన్ వీడియోపై టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది. మీరు చూసే వీడియోలో క్యాప్షన్లు అందుబాటులో ఉంటే.. మీకు కనిపించే CC బటన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. గత ఏప్రిల్‌లో ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసిన ప్రతి వీడియోపై క్యాప్షన్ అందించడానికి ‘CC’ బటన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించినట్లు ట్విట్టర్ ధృవీకరించింది. అయితే ఈ కొత్త ఫీచర్ పరిమిత సంఖ్యలో ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Twitter Closed Caption Toggle Is Now Available For Ios, Android Users
Twitter కంపెనీ ఈ ఏడాదిలో ప్లాట్‌ఫారమ్‌లో అనేక కొత్త అప్డేట్స్ రిలీజ్ చేసింది. యూజర్ల అనుచిత ట్వీట్లను నివేదించడంలో ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు మరింత సౌకర్యంగా సురక్షితంగా అనిపించేలా సెన్సిటివ్ వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ట్వీట్ వార్నింగ్స్‌పై Twitter ఒక కొత్త అప్డేట్ అందించింది.
Video captions or no captions, it’s now easier to choose for some of you on iOS, and soon on Android.
On videos that have captions available, we’re testing the option to turn captions off/on with a new “CC” button. pic.twitter.com/Q2Q2Wmr78U
— Twitter Support (@TwitterSupport) April 22, 2022
Twitter లిమిట్ కేపాసిటీలో CEA-స్టయిల్ క్యాప్షన్లకు సపోర్టు ఇస్తుంది. యూజర్లు వారి Android లేదా iOS డివైజ్‌ల్లో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ద్వారా క్లోజ్డ్ క్యాప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. మీరు చూసే వీడియోలో సబ్ టైటిల్స్ ఉన్నట్లయితే.. iOS, Androidలో మీ డివైజ్ సౌండ్ ఆఫ్ చేసి ఉంటే లేదా వెబ్‌లో ‘CC’ బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు డిఫాల్ట్‌గా, వీడియోను పెద్దదిగా చేసినప్పుడు దానిపై సబ్ క్యాప్షన్లు హైడ్ అవుతాయి. ఎందుకంటే సౌండ్ ప్లేబ్యాక్ అవుతుంటుంది.
.SRT సబ్ టైటిల్స్ ఎలా వర్క్ అవుతాయంటే? :
మీ మీడియా స్టూడియో లైబ్రరీలోని వీడియోపై క్లిక్ చేయండి.
పాప్-అప్ విండోలో “Subtitles” Tabను ఎంచుకోండి.
డ్రాప్‌డౌన్ మెను నుంచి మీ Subtitle ఫైల్ Text Language ఎంచుకోండి.
‘అప్లోడ్’ బటన్‌ను క్లిక్ చేయాలి. మీ స్థానిక కంప్యూటర్ నుంచి సైడ్‌కార్ .SRT ఫైల్‌ను ఎంచుకోండి.
ఇప్పుడు ఈ కొత్త ఫైల్ మీ వీడియోతో లింక్ అయింది.
ఫైల్‌ను అప్డేట్ చేయడానికి, పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
Read Also : Twitter: ట్వీట్లో అక్షరాల పరిమితిని 280 నుంచి 2,500కు పెంచుతున్న ట్విటర్