Twitter Monetisation : ట్విట్టర్‌‌లో కొత్త మానిటైజేషన్ ఫీచర్లు.. క్రియేటర్లు అప్లయ్ చేసుకోవచ్చు.. సంపాదించొచ్చు..

అమెరికా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ కొత్త మానిటైజేషన్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇకపై ట్విట్టర్ యూజర్లు సోషల్ ప్లాట్ ఫాం నుంచి కూడా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ట్విట్టర్ క్రియేటర్ల కోసం మానిటైజేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Twitter Monetisation : ట్విట్టర్‌‌లో కొత్త మానిటైజేషన్ ఫీచర్లు..  క్రియేటర్లు అప్లయ్ చేసుకోవచ్చు.. సంపాదించొచ్చు..

Twitter Creators Can Start Applying For New Monetisation Features Now (1)

Twitter new monetisation features for creators : అమెరికా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ కొత్త మానిటైజేషన్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇకపై ట్విట్టర్ యూజర్లు సోషల్ ప్లాట్ ఫాం నుంచి కూడా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ట్విట్టర్ క్రియేటర్ల కోసం మానిటైజేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అవే.. Super Follows, Ticketed Spaces ఫీచర్లు.. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజర్లు సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లతో ఆదాయాన్ని సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ కూడా తమ క్రియేటర్ల కోసం మానిటైజేషన్ అందిస్తోంది.

ప్రస్తుతానికి ఈ సబ్ స్ర్కిప్షన్ ప్లాన్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రీమియమ్ బ్లూ పెయిడ్ సర్వీసులను ప్రారంభించిన ట్విట్టర్.. ఈ రెండు సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ల ద్వారా ట్విటర్ యూజర్లు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఇన్ యాప్ పర్‌చేజ్ ఫీజు తర్వాత 97శాతం ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని ట్విట్టర్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ ఈస్తర్ క్రాఫార్డ్ ట్వీట్ ద్వారా తెలిపారు. Super Follows ఫీచర్ ద్వారా క్రియేటర్లు ఛార్జీలు కూడా వసూలు చేయొచ్చు.

ఈ ఫీచర్ ద్వారా ఎక్సూక్లీజివ్ కంటెంట్ అందించేందుకు నెలకు 2.99, 4.99, 9.99 డాలర్ల వరకు సబ్ స్ర్కైబర్ల నుంచి ఛార్జీలుగా వసూలు చేయొచ్చు. ట్విట్టర్ ఆడియో ఓన్లీ ప్లాట్ ఫాం ద్వారా స్పెషల్ ఆడియో రూమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మరో ఫీచర్ Ticketed Spaces ద్వారా టిక్కెట్ల ధర 1 డాలర్ నుంచి 9.99 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంతనేది హోస్ట్ నిర్ణయం తీసుకుంటారు. నెలకు 2.99 డాలర్లు లేదా 4.99 డాలర్లు, 9.99 డాలర్లను ధరను కేటాయిస్తారు. ఫాలోవర్లు వీటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటినుంచి ఈ ఫీచర్లు స్మాల్ గ్రూపు యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.

సూపర్ ఫాలోస్, టికెటెడ్ స్పేసెస్ ఫాలోవర్ల నుంచి ట్విటర్ కేవలం 3 శాతం మాత్రమే కట్ చేయనుంది. భవిష్యత్తులో యూజర్ ఆదాయం 50 వేల డాలర్లు దాటితే మాత్రం ట్విట్టర్ షేర్ 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. యాపిల్, గూగుల్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువనేనని మైక్రోబ్లాగింగ్ కంపెనీ అంటోంది. ఈ కొత్త మానిటైజేషన్ ఫీచర్లను ఓసారి ట్రై చేయాలని అమెరికా యూజర్లను ట్విట్టర్ ఆహ్వానించింది. ఆండ్రాయిడ్ సహా iOS యూజర్లకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.