Aadhaar-PAN Link : పాన్ ఆధార్ లింక్‌పై ట్విట్టర్‌లో మీమ్స్ ట్రెండింగ్.. నెటిజన్ల జోకులే జోకులు..!

Aadhaar-PAN Link : పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? మార్చి 31 దాటితే పెనాల్టీ తప్పదు.. ఎక్కడ రూ. 1000 జరిమానా చెల్లించాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడ్డారు. ఇప్పటివరకూ లింక్ చేసుకుని వారంతా హడావుడి చేశారు.

Aadhaar-PAN Link : పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? మార్చి 31 దాటితే పెనాల్టీ తప్పదు.. ఎక్కడ రూ. 1000 జరిమానా చెల్లించాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడ్డారు. ఇప్పటివరకూ లింక్ చేసుకుని వారంతా హడావుడి చేశారు. ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని అంతా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి మరి స్టేటస్ చెక్ చేసుకున్నారు.

చాలామంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో లింక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అంతే.. రెండు కార్డులను లింక్ చేసే సమయంలో దేశవ్యాప్తంగా అనేక మంది సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకేసారి ఎక్కువ మంది పాన్-ఆధార్ లింక్ వెబ్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్ కాస్తా డౌన్ అయిపోయింది.

Read Also : Aadhaar Linkage Voter ID: ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానంకు గడువును పెంచిన కేంద్రం ..

కనెక్టివిటీ సమస్యలతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్న వారంతా సోషల్ మీడియా వేదికగా ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

కొందరు నెటిజన్లు అయితే తమ పరిస్థితిని వివరించేందుకు జోకులు, మీమ్స్‌తో ఫన్నీగా స్పందిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తమ పాన్ ఆధార్ లింక్ కావడం లేదని నెటిజన్లు వాపోయారు.

ఆధార్ పాన్ లింక్ చేయకపోతే రూ.1000 జరిమానా చెల్లించాలా? కొంతమందికి ఇది చాలా పెద్ద అమౌంట్.. కనీసం మూడు, నాలుగు రోజులు కష్టపడితే కానీ అంతా మొత్తాన్ని చెల్లించలేరు.. కాస్తా అమౌంట్ తగ్గించండి అంటూ మరో ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు.


సింపుల్ గా పాన్ పై ఆధార్ కార్డుతో ఉన్న ఫొటోను మరో నెటిజన్ పోస్టు చేశాడు. ఎట్టకేలకు నా పాన్ ఆధార్ కార్డు లింక్ అయింది.. ఇప్పటికీ లింక్ చేసుకోని వారి సంగతి ఏంటి మరో నెటిజన్ పోస్టు పెట్టాడు.

ఇంతలోనే చావు కబురు చల్లగా చెప్పినట్టుగా.. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలానే పాన్-ఆధార్ కార్డు గడువును మరోసారి పెంచుతున్నట్టుగా ప్రకటించింది. పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

మరో మూడు నెలల గడువును పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. మరో ఆరు నెలలు గడువు పెంచితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.

Read Also : Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

ట్రెండింగ్ వార్తలు