Twitter Search Prompt : ట్విట్టర్‌లో రెండు భాషల్లో కొత్త సెర్చ్ ప్రాంఫ్ట్ ఫీచర్..!

ప్రముఖ బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. సెర్చ్ నోటిఫికేషన్ సర్వీసెస్. ఈ సెర్చ్ ప్రాంఫ్ట్ ఫీచర్ ద్వారా యూజర్లకు HIV, AIDS సంబంధిత సమాచారాన్ని అందించనుంది.

Twitter Search Prompt : ట్విట్టర్‌లో రెండు భాషల్లో కొత్త సెర్చ్ ప్రాంఫ్ట్ ఫీచర్..!

Twitter Introduces Search Prompt For Hiv, Aids In Hindi, English

Twitter Search Prompt : ప్రముఖ బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. సెర్చ్ నోటిఫికేషన్ సర్వీసెస్. ఈ సెర్చ్ ప్రాంఫ్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు HIV, AIDS సంబంధిత సమాచారాన్ని సెర్చ్ చేసేందుకు తీసుకొచ్చింది ట్విట్టర్. అయితే ఈ సెర్చ్ ఫీచర్ హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో అందుబాటులో ఉంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు నేషనల్ AIDS కంట్రోల్ ఆర్గానైజేషన్ (NACO) భాగస్వామ్యంలో ఈ ఫీచర్ తీసుకొచ్చింది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డే (World AIDS Day) సందర్భంగా మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ఈ కొత్త సెర్చ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఎయిడ్స్, హెచ్ఐవీ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ట్విట్టర్ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ రెండింటి వ్యాధులకు సంబంధించి అధికారిక సమాచారాన్ని సెర్చ్ చేసేందుకు వీలుంగా ట్విట్టర్ ఈ సెర్చ్ నోటిఫికేషన్ సర్వీసును ప్రవేశపెట్టింది. ఇందులో వ్యాధి సమాచారంతో పాటు హెల్ఫ్ లైన్ సర్వీసు కూడా ఉంటుంది. ఈ ప్రాంఫ్ట్ మెసేజ్ ట్విట్టర్ సెర్చ్ సెక్షన్ వద్ద కనిపిస్తుంది. ట్విట్టర్ యూజర్ ఎవరైనా #HIV, #AIDS వంటి కీవర్డ్స్ ఆధారిత సమాచారాన్ని సెర్చ్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రాంఫ్ట్ డిస్‌ప్లే అవుతుంది.

ప్రస్తుతానికి ట్విట్టర్ ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ప్రాంఫ్ట్ ఫీచర్.. బ్రెజిల్, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, ఇండియా, జపాన్, మలేసియా, ఫిలిఫ్పైన్స్, సింగపూర్, ఎస్పీ-లాటమ్, తైవాన్, థాయిలాండ్, అమెరికా దేశాల్లోని ట్విట్టర్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. HIV/AIDS క్యాంపెయిన్ లో భాగంగా ట్విట్టర్ లిమిటెడ్ రెడ్ రిబ్బెన్ ఎమోట్ ఐకాన్ కూడా ప్రవేశపెట్టింది. ఈ వ్యాధిపై జరిగే అన్ని సంభాషణలపై ఇది కనిపిస్తుంది. అలాగే డిసెంబర్ 5 వరకు ట్విట్టర్ ప్లాట్ ఫాంలో #WorldAIDSDay అనే హ్యాష్ ట్యాగ్ కూడా కనిపించనుంది.

Read Also :  Parag Agrawal : ట్విట్టర్ కొత్త సీఈవో జీతం ఎంతో తెలుసా ? కళ్లు చెదిరిపోతుంది