Twitter: ట్విట్టర్‭లో కొత్త ఫీచర్.. ఇప్పుడిక వీడియో, ఫొటో, జిఫ్ కలిపి ట్వీట్ చేయొచ్చు

వాస్తవానికి ఈ ఫీచర్ ఇప్పుడే కొత్తగా తీసుకువచ్చింది ఏమీ కాదు. కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు ఇది అందుబాటులోనే ఉంది. బహుశా ప్రయోగాత్మకంగా అలా ఇచ్చారో, లేదంటే మరింకే కారణమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ ఫీచర్‭ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

Twitter: ట్విట్టర్‭లో కొత్త ఫీచర్.. ఇప్పుడిక వీడియో, ఫొటో, జిఫ్ కలిపి ట్వీట్ చేయొచ్చు

Twitter now allows you to combine photos, videos and GIFs in single tweet on Twitter

Twitter: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుకునే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. తాజాగా మరో కొత్త ఫీచర్‭ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకే ట్వీట్‭లో ఫొటో, వీడియోతో పాటు జిఫ్‭ను కూడా కలిపి పోస్ట్ చేసే విధంగా ఈ ఫీచర్ సహకరిస్తుంది. ఒక ట్వీట్ కేవలం 280 క్యారెక్టర్లు మాత్రమే ఉండడం వల్ల.. యూజర్ల అభిప్రాయాలు మరింత బాగా వ్యక్తం చేయడానికి కొత్త ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుందని ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది.

వాస్తవానికి ఈ ఫీచర్ ఇప్పుడే కొత్తగా తీసుకువచ్చింది ఏమీ కాదు. కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు ఇది అందుబాటులోనే ఉంది. బహుశా ప్రయోగాత్మకంగా అలా ఇచ్చారో, లేదంటే మరింకే కారణమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ ఫీచర్‭ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయమై ట్విట్టర్ యాజమాన్యం ట్వీట్ ద్వారా స్పందిస్తూ ‘‘ట్విట్టర్‭లో విజువల్స్‭ను మిక్స్ అప్ చేయడానికి సిద్ధం అవ్వండి. ఆండ్రాయిడ్ అయినా, ఐఓఎస్ అయినా మీకు సరికొత్త అనుభూతి లభిస్తుంది. ఫొటో, జిఫ్, వీడియో కలిపి టెక్స్ట్‭తో ట్వీట్ చేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. ఎప్పటిలాగే ట్వీట్ కంపోజర్ మీద క్లిక్ చేసి నూతన ట్వీట్ చేయొచ్చు’’ అని పేర్కొన్నారు.

ఒక్క ట్వీట్‭లో ఫొటో, జిఫ్, వీడియో కలిపి మొత్తంగా నాలుగు యాడ్ చేయొచ్చని ట్విట్టర్ యాజమాన్యం పేర్కొంది. ఈ కొత్త ఫీచర్‭ను ఆండ్రాయిడ్, ఐఫోన్ సహా అన్ని వేదికల్లో ఒకేసారి అందుబాటులోకి తీసుకువస్తున్నారట.

Facebook: గుట్టుచప్పుడు కాకుండా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా