Twitter: ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్‌ వెరిఫికేషన్ నిలిపివేత.. ఎందుకంటే?

అమెరికన్ మైక్రో-బ్లాగింగ్‌, సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రొగ్రామ్‌ను మళ్లీ నిలిపివేసింది.

Twitter: ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్‌ వెరిఫికేషన్ నిలిపివేత.. ఎందుకంటే?

Twitter Pauses Account Verification Programme

Twitter Pauses Account Verification Programme : అమెరికన్ మైక్రో-బ్లాగింగ్‌, సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రొగ్రామ్‌ను మళ్లీ నిలిపివేసింది. ట్విట్టర్ అకౌంట్లకు ఇచ్చే బ్లూటిక్‌ వెరిఫికేషన్ ప్రోగ్రా‌మ్‌ (Blue Check Mark Verification Programme)ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వెరిఫికేషన్‌ రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్‌ సర్వీసును నిలిపివేసినట్లు తెలిపింది. కొత్త ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చే అప్లికేషన్లను అనుమతించడం లేదు. ఇదివరకే పలు ఫేక్‌ ట్విట్టర్ అకౌంట్లను (Twitter Fake Accounts) తప్పుగా వెరిఫికేషన్‌ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్‌ నిర్థారించింది.

ఒకవేళ ఇటీవల మీరు మీ ట్విట్టర్ కొత్త అకౌంట్ ధృవీకరణ కోసం అప్లయ్ చేసి ఉంటే.. బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది వారాల్లో ట్విట్టర్ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌కు వచ్చే అప్లికేషన్లను తిరిగి పరిశీలిస్తామని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ట్విట్టర్ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రాంను నిలిపివేయడం ఇది తొలిసారి కాదు. 2017 ఏడాదిలోనూ బ్లూటిక్‌ సర్వీసులను ట్విట్టర్ నిలిపివేసింది.


మరోవైపు.. ట్విట్టర్ ఇండియా (Twitter India) హెడ్‌ మనీష్‌ మహేశ్వరిని ట్విట్టర్ తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్విట్టర్ ఇండియా హెడ్‌ నియమితులైన మనీష్‌ మహేశ్వరి అమెరికాకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా నియమించనున్నట్లు సమాచారం.

Twitter India : ట్విట్టర్ సంచలన నిర్ణయం..ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ