Twitter : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

ట్విట్టర్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ట్విట్టర్ సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నామని యూజర్లు...

Twitter : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

twitter

Twitter Says Technical Issues : ఏ విషయమైనా వెంటనే ఇతరులకు తెలియచేయాడంలో సోషల్ మీడియా కీలక స్థానంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో ఆ విషయం తెలిసిపోతుంది. ఎంతో మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఎన్నింటినో వాడుతుంటారు. అయితే.. అప్పుడప్పుడు కొన్ని టెక్నికల్ గా సమస్యలు వస్తుంటాయి. దీంతో యూజర్లు తీవ్ర అసహానికి గురవుతుంటారు. కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడంతో యూజర్లు పోస్టులు, ఇతరత్రా చేయలేకపోతుంటారు.

Read More : అదేపనిగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఆరోగ్యానికి ముప్పే..!

దీంతో వారు ఫిర్యాదులు చేస్తుంటారు. తాజాగా.. ప్రముఖ స్థానమైన ట్విట్టర్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ట్విట్టర్ సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నామని యూజర్లు ఫిర్యాదు చేశారు. ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం భారత్ లో గంటపాటు ట్విట్టర్ సేవలను ఉపయోగించుకోలేకపోయామని యూజర్లు వెల్లడించారు. మొబైల్స్, వెబ్ సైట్ లో కూడా ట్విట్టర్ లో సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. లోడింగ్ సమస్యతో పాటు పోస్టింగ్ లు చేయలేకపోయామని వారు ఫిర్యాదులో తెలిపారు.

Read More : Virat Kohli : అయ్యయ్యో… 3 వన్డేల్లో 26 పరుగులు, 8సార్లు డకౌట్.. విరాట్ కోహ్లికి ఏమైంది?

లాగిన్ కూడా కాలేదని మరికొంతమంది తెలిపారు. లాగిన్ కాగానే..వెంటనే లాగౌట్ అంటూ వచ్చిందని ఇంకొంతమంది ఫిర్యాదులో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని యూజర్లు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం స్పందించింది. టెక్నికల్ గా సమస్యలు ఏర్పడ్డాయని, వెంటనే దీనిని సరిచేయడం జరిగిందని యూజర్లకు తెలిపింది. జరిగిన అంతరాయనికి క్షమించాలని విజ్ఞప్తి చేసింది.