COVID-19 వ్యాక్సిన్‌పై ఫేక్ Tweet చేశారా.. ఇక అంతే!

COVID-19 వ్యాక్సిన్‌పై ఫేక్ Tweet చేశారా.. ఇక అంతే!

Twitter to ban : కరోనా వ్యాక్సిన్ పై ఏది పడితే..అది షేర్ చేస్తున్నారా. ఇక నుంచి అలా కుదరదు. ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే..వెంటనే వాటిని తొలగిస్తామని ట్విటర్ (Twitter) వెల్లడించింది. వచ్చే వారంలో మరిన్ని నిబంధనలు తీసుకొస్తామని ప్రకటించింది. వైరస్, వ్యాక్సిన్ల విషయంలో అసత్య ట్వీట్లను ఓ జాబితాగా తయారు చేయడం జరిగిందని తెలిపింది. కొవిడ్ – 19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి తమ సైట్‌లో ఉన్న తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగిస్తామని చెప్పింది.

వచ్చే వారంలో కొత్తగా తీసుకరానున్న విధానాలపై ట్విట్టర్ తన బ్లాగ్‌లో పోస్టు చేసింది. అమెరికాలో అతిపెద్ద వ్యాక్సినేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీకాకు సంబంధించి ఫేక్ న్యూస్, సమాచారం, వివాదాస్పద సందేశాలు తమ మాధ్యమంలో చోటు ఉండదని ట్విట్టర్ సంస్థ స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు దేశాలు వ్యాక్సిన్ ప్రక్రియలో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటించిన పలు సంస్థలు..వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టాయి. అమెరికాలో భారీ వ్యాక్సిన్ పంపిణీ స్టార్ట్ చేశారు. తొలి టీకాను ఓ నర్సుకు ఇచ్చారు. క్వీన్స్‌లోని లాంగ్ ఐలండ్ యూదు మెడికల్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో పనిచేస్తున్న నర్సు శాండ్రా లిండ్రే ఫైజర్ ఈ టీకా తీసుకున్నారు.