Twitter Users : మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిందా? ఫిబ్రవరి 1 నుంచి అప్పీల్ చేసుకోవచ్చు..!

Twitter Users : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్ సస్పెన్షన్‌ విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఇకపై మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయితే అప్పీల్ చేసుకోవచ్చు.

Twitter Users : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్ సస్పెన్షన్‌ విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఇకపై మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయితే అప్పీల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ప్రమాణాల ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది. అక్టోబర్‌లో బిలియనీర్ ఎలోన్ మస్క్ కంపెనీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్విట్టర్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రమాణాల ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉల్లంఘనలకు మాత్రమే Twitter అకౌంట్లను నిలిపివేయనుంది.

ట్విట్టర్ పాలసీ ఉల్లంఘనలలో చట్టవిరుద్ధమైన కంటెంట్, హింస లేదా హానిని ప్రేరేపించడం లేదా బెదిరించడం, ఇతర యూజర్లను లక్ష్యంగా చేసుకుని వేధించడం వంటివి ఉంటాయి. అకౌంట్ సస్పెన్షన్‌తో పోల్చితే.. ట్విట్టర్ విధానాలను ఉల్లంఘించే ట్వీట్‌ల పరిధిని పరిమితం చేయనుంది. ఖాతాను కొనసాగించే ముందు ట్వీట్‌లను తొలగించమని యూజర్లను హెచ్చరించనుంది.

Read Also : Realme Coca-Cola Phone : రియల్‌మి నుంచి కోకా-కోలా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

గత డిసెంబరులో బిలియనీర్ విమానం గురించి పబ్లిక్ డేటాను ప్రచురించినందుకు పలువురు జర్నలిస్టుల అకౌంట్లను సస్పెండ్ చేశారు. అనంతరం మస్క్ వారి ట్విట్టర్ అకౌంట్లను రీస్టోర్ చేశాడు. కొన్ని రోజుల క్రితం, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచుతున్నట్టు ట్వీట్ చేశారు.

Twitter to Let Users Appeal Account Suspension Starting February 1

ఈ సబ్‌స్క్రిప్షన్ పొందిన ట్విట్టర్ యూజర్లకు ఎలాంటి యాడ్స్ కనిపించవు. రాబోయే వారాల్లో యాడ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ తన ఆదాయంలో దాదాపు 90 శాతం డిజిటల్ యాడ్స్ విక్రయించడం ద్వారా సంపాదిస్తుంది. ట్విట్టర్ యాడ్స్ పాజ్ చేయమని బ్రాండ్‌లపై ఒత్తిడి తెచ్చిన కమ్యూనిటీలపై మస్క్ మండిపడ్డారు.

ఈ ఏడాది జనవరిలో, మైక్రోబ్లాగింగ్ సైట్ ఆండ్రాయిడ్ కోసం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధరను iOS సబ్‌స్క్రైబర్‌ల ఫీజు మాదిరిగానే నెలకు 11 డాలర్లు (దాదాపు రూ. 900)గా ప్రకటించింది. అయితే, నెలవారీ ఛార్జీలతో పోల్చినప్పుడు.. కంపెనీ వెబ్ యూజర్ల కోసం తక్కువ వార్షిక ప్లాన్‌ను అందించింది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం, ఆపిల్ యాప్ స్టోర్ వంటి ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వసూలు చేసే రుసుములను తగ్గించే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 60GB డేటా, మరెన్నో బెనిఫిట్స్..!

ట్రెండింగ్ వార్తలు