Twitter Shrek Full Movie : మస్క్ మామకు దిమ్మతిరిగే షాక్.. ట్విట్టర్‌లో ష్రెక్ ఫుల్ మూవీ అప్‌లోడ్ చేసిన యూజర్.. ఇదిగో చూడంటూ రీట్వీట్..!

Twitter Shrek Full Movie : ట్విట్టర్‌లో ఇకపై రెండు గంటల నిడివి వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చని ఎలన్ మస్క్ ఇలా ప్రకటించాడో లేదో అంతలోనే ఓ ట్విట్టర్ యూజర్ ఏకంగా ష్రెక్ ఫుల్ మూవీ అప్ లోడ్ చేసి చూపించాడు.

Twitter Shrek Full Movie : మస్క్ మామకు దిమ్మతిరిగే షాక్.. ట్విట్టర్‌లో ష్రెక్ ఫుల్ మూవీ అప్‌లోడ్ చేసిన యూజర్.. ఇదిగో చూడంటూ రీట్వీట్..!

Twitter user uploads entire Shrek movie after Elon Musk allows subscriber to upload 2-hour-long videos

Twitter Shrek Full Movie upload by User : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)లో ఇకపై రెండు గంటల నిడివితో లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాడు. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రెండు గంటల నిడివి వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చునని ప్రకటించాడు. ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ యూజర్లు ఏదైనా ఫుల్ వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. మస్క్ నాయకత్వంలో ట్విటర్ డైనమిక్స్ పూర్తిగా రూపాంతరం చెందింది. ట్విట్టర్ ప్రారంభంలో యూజర్లకు పరిమిత సంఖ్యలో ట్వీట్ క్యారెక్టర్లను అందించింది. ఇప్పుడు యూజర్లకు బ్లాగులను రాయడం, లాంగ్ వీడియోలను షేర్ చేయడం వంటి అనేక ఆప్షన్లను ట్విట్టర్ అందిస్తోంది.

Read Also : Twitter CEO : ట్విట్టర్‌‌లో ఇకపై 2 గంటల నిడివి వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చు.. వారికి మాత్రమేనట.. మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా..!

అందులో భాగంగానే ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ వెంటనే మస్క్ ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ట్వీట్ షేర్ చేశాడు. మస్క్ ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు 2 గంటల వీడియోలను (8GB) వరకు అప్‌లోడ్ చేయవచ్చునని మస్క్ ప్రకటించాడు. అంతే.. మస్క్ జోక్ చేస్తున్నాడా? లేదా అని ట్విట్టర్ యూజర్లు టెస్టింగ్ చేసినట్టు ఉన్నారు. ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగించి ట్విట్టర్‌లో ష్రెక్ ఫుల్ మూవీ (Shrek Full Movie) అప్‌లోడ్ చేశారు. ఈ సినిమాను అప్‌లోడ్ చేసిన తర్వాత.. ట్విట్టర్ యూజర్ అప్‌లోడ్ చేసిన మూవీ స్క్రీన్‌షాట్‌తో మస్క్ ట్వీట్‌పై స్పందించాడు. ఇప్పుడు ట్విట్టర్ టీమ్ మీడియాను డిసేబుల్ చేసినట్టు కనిపిస్తోంది.

యూట్యూబ్‌కు పోటీగా ట్విట్టర్ లాంగ్ వీడియో ఫీచర్? :
లాంగ్ వీడియోలతో ట్విట్టర్ యూట్యూబ్ (YouTube)కు పోటీగా ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా ట్విట్టర్ కొత్త ఫీచర్ ద్వారా YouTubeపై కొంత వరకు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కానీ, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. యూట్యూబ్ వీడియో కంటెంట్ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ కలిగి ఉంది. క్రియేటర్లు, వ్యూయర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనేక రకాల ఫీచర్‌లను యూట్యూబ్ అందిస్తోంది.

Twitter user uploads entire Shrek movie after Elon Musk allows subscriber to upload 2-hour-long videos

Twitter user uploads entire Shrek movie after Elon Musk allows subscriber to upload 2-hour-long videos

ఇప్పటికే ఈ ప్లాట్‌ఫారంలో విస్తారమైన యూజర్ బేస్, ఆన్‌లైన్ వీడియో స్పేస్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. ట్విట్టర్ లాంగ్ వీడియో అప్‌లోడ్‌ ఫీచర్ ప్రవేశపెట్టడంతో షార్ట్ సైజ్ వీడియోలను ఇష్టపడే లేదా ట్విట్టర్ పర్యావరణ వ్యవస్థలో వీడియోలను షేర్ చేయాలనుకునే కొంతమంది యూజర్లను ఆకర్షించవచ్చు. యూట్యూబ్ ఇప్పటికీ అనేక ప్రయోజనాలను పొందుతోంది. ఇందులో యూట్యూబ్ అందించే మానిటైజేషన్ ఆప్షన్లు, క్రియేటర్లు, వీక్షకులకు అత్యంత సులభమైన కమ్యూనిటీని అందిస్తోంది.

ఇక, ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల యూజర్ బేస్ విభిన్న పరిమితులను కలిగి ఉంటాయి. ట్విట్టర్ లాంగ్ వీడియో ఫీచర్ వీడియో కంటెంట్ వినియోగానికి మరింత పెంచనుంది. అయితే, ఆన్‌లైన్ వీడియో మార్కెట్‌లో యూట్యూబ్ ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం లేదనే చెప్పాలి. చాలా కాలం తర్వాత ట్విట్టర్ కొత్త సీఈఓను నియమించింది. మస్క్ కంపెనీకి కొత్త చీఫ్‌గా NBC చైర్మన్ లిండా యాకారినో (Linda Yaccarino)ను ప్రకటించారు. ఈమే మీడియా, టెక్ పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు. కంపెనీలో ఇప్పటివరకు పనిచేసిన సీఈఓల్లో నాన్-టెక్ ఫస్ట్ మహిళా సీఈఓగా లిండా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also : ChatGPT App : ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?