Twitter View Count : ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీరు చేసే ప్రతి ట్వీట్ ఎంతమంది చూశారో ‘వ్యూ కౌంట్’ తెలుసుకోవచ్చు..!

Twitter View Count : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ కొత్త నిబంధనలు, ఫీచర్లను తీసుకువస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్..

Twitter View Count : ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీరు చేసే ప్రతి ట్వీట్ ఎంతమంది చూశారో ‘వ్యూ కౌంట్’ తెలుసుకోవచ్చు..!

Twitter View Count _ Elon Musk rolls out view count which lets you know how many people saw your tweets

Twitter View Count : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ కొత్త నిబంధనలు, ఫీచర్లను తీసుకువస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్.. మరెన్నో కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నాడు. మస్క్ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ మస్క్ ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేటెస్టుగా మస్క్.. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్‌లో ‘View Count‘ అనే కొత్త ఫీచర్‌ను రూపొందించారు. దీని సాయంతో ఇప్పుడు ట్విట్టర్ వినియోగదారులు తమ ట్వీట్ ఎలా రీచ్ అవుతుందో చూడవచ్చు.

ట్విట్టర్ రూపొందించిన ఈ కొత్త ఫీచర్ (YouTube) వంటి ప్లాట్‌ఫారమ్‌లను పోలి ఉంటుంది. సాధారణంగా యూట్యూబ్ వీడియోను ఎన్నిసార్లు వీక్షించారో చూడవచ్చు. అలాగే ఇకపై ట్విట్టర్ యూజర్లు తమ ట్వీట్లను ఎంతమంది చూశారో కూడా కౌంట్ చేయవచ్చు. అందులో భాగంగా ఏదైనా ట్వీట్ చేసిన వినియోగదారులు మాత్రమే ట్వీట్ విశ్లేషణలను ఉపయోగించి వ్యూలను లెక్కించారు. ట్విటర్‌లో CEO ఎలోన్ మస్క్ చెప్పిన ప్రకారం.. ‘ట్విట్టర్ వ్యూ కౌంట్‌ ఫీచర్ వచ్చేసింది. మీరు ట్వీట్ ఎంతమంది ఎన్నిసార్లు చూశారో చూడొచ్చు.

Read Also : Twitter Accounts : మీ ట్విట్టర్‌‌లో ఆ లింకులను ప్రమోట్ చేస్తున్నారా? ఈ కొత్త విధానంతో మీ అకౌంట్లను కోల్పోతారు జాగ్రత్త..!

ట్విట్టర్‌లో మీ ట్వీట్ ఎంతమందికి చేరిందో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు’ అని మస్క్ అన్నారు. ‘ట్విటర్‌లో 90% మంది వినియోగదారులు చదివినట్లుగా అందరికి చూపిస్తుంది. వీడియోలకు వ్యూ కౌంట్ చూపినట్లే అన్ని ట్వీట్లకు ఫీచర్ వర్తిస్తుంది’ అని మస్క్ తెలిపాడు. టెక్ క్రంచ్‌లోని నివేదిక ప్రకారం.. ఇప్పుడు ట్విట్టర్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో లేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం iOS, Androidలో అందుబాటులో ఉంది. రివర్స్ యాప్ పరిశోధకురాలు నిమా ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. డిసెంబర్ 15 తర్వాత పోస్ట్ చేసిన ట్వీట్‌లకు ఈ వ్యూ కౌంట్ వర్తిస్తుందని తెలిపారు.

Twitter View Count _ Elon Musk rolls out view count which lets you know how many people saw your tweets

Twitter View Count _ Elon Musk rolls out view count which lets you know

మస్క్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో మరొక కొత్త ఫీచర్‌ను కూడా ఆవిష్కరించారు. పెట్టుబడిదారులు, వ్యాపారులు, ఫైనాన్స్ రంగంలోని యూజర్లకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులను కేవలం ట్వీట్‌లో ప్రధాన స్టాక్‌లు, క్రిప్టోకరెన్సీలు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) చార్ట్‌లు, గ్రాఫ్‌లను వీక్షించేందుకు అనుమతిస్తుంది. డిసెంబర్ 19న మస్క్.. ట్విట్టర్ సీఈఓగా తప్పుకోనున్నట్టు వెల్లడించాడు. సీఈఓ బాధ్యతలు చేపట్గగల సమర్థులు దొరికిన వెంటనే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నుంచి తాను రాజీనామా చేస్తానని చెప్పాడు.

ఆ తర్వాత, సాఫ్ట్‌వేర్ & సర్వర్‌ల బృందాలను నడుపుతానని మస్క్ ట్విట్టర్‌లో తెలిపారు. మస్క్ తన పదవీకాలంపై వినియోగదారుల తీర్పును కోరుతూ ట్విట్టర్‌లో ఒక పోల్‌ను ప్రారంభించాడు. ఆదివారంతో పోల్ గడువు ముగియగా.. 57.5 శాతం మంది ఆయనను ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగాలంటూ ఓటు వేశారు. పోల్ ఓటింగ్ లో పాల్గొన్న యూజర్ల అభిప్రాయానికి తాను కట్టుబడి ఉంటానని మస్క్ వెల్లడించాడు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Character Limit : ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ పెరిగిందోచ్.. ఎక్కడి నుంచి ఎంతవరకు? ఎలన్ మస్క్ మాటల్లోనే..!