Twitter Bug: ట్విట్టర్‌లో బగ్ చెప్పండి.. భారీ ప్రైజ్ మనీ కొట్టేయండి

ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే రేంజ్ లో ప్లాన్ చేసింది ట్విట్టర్. తమ యూజర్లను ఛాలెంజ్ చేస్తూ ఆసక్తికర పోటీ మొదలుపెట్టింది. ఎంగేజ్మెంట్ పెంచుకోవడంతో పాటు తమ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేసింది. ట్విట్టర్ వాడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథంలో బగ్‌ను గుర్తించి రివార్డు కొట్టేయమని ప్రకటించింది.

Twitter Bug: ట్విట్టర్‌లో బగ్ చెప్పండి.. భారీ ప్రైజ్ మనీ కొట్టేయండి

Twitter Bug

Twitter Bug: ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే రేంజ్ లో ప్లాన్ చేసింది ట్విట్టర్. తమ యూజర్లను ఛాలెంజ్ చేస్తూ ఆసక్తికర పోటీ మొదలుపెట్టింది. ఎంగేజ్మెంట్ పెంచుకోవడంతో పాటు తమ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేసింది. ట్విట్టర్ వాడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథంలో బగ్‌ను గుర్తించి రివార్డు కొట్టేయమని ప్రకటించింది.

ట్విటర్‌ బగ్‌ బౌంటీ ప్రోగ్రాంను ట్విట్టర్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. యూజర్లను.. రీసెర్చర్లను సవాల్ చేస్తూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై అల్గారిథమ్ బేస్డ్ గా పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను పరీక్షించమని చెప్పింది. ఈ మేరకు ప్రైజ్ మనీని 3వేల 500డాలర్లుగా ప్రకటించారు.

చాలా వెబ్ సైట్లు, ప్లాట్ ఫాంలు తమ సెక్యూరిటీ హోల్స్, లోపాలను సరిచేసుకోవడానికి ఇలాంటి కాంపిటీషన్లు పెడుతుంటాయని ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చౌదరి, జుట్టా విలియమ్స్ అన్నారు.

మెషీన్ లోని బయాస్ ను కనుగొనడం కొంచెం కష్టమే. కొన్ని సార్లు కంపెనీలు అవి కనుగొనలేకపోవచ్చు. అలాంటప్పుడు యూజర్లకు హాని కలిగే ప్రమాదం ఉంది. దాని నుంచి బయటపడేందుకే దీనిని తీసుకొచ్చాం. అని చౌదరి, విలియ్స్ బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చారు.

ప్రైజ్ మనీ వివరాలిలా ఉన్నాయి. మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $ 3,500 (సుమారు రూ. 2,60,242), $ 1,000 (సుమారు రూ. 74,369), $ 500 (సుమారు రూ. 37,184) నగదు బహుమతులను అందిస్తారు.

ఆగస్టు 8న జరిగే డేఫ్‌ కాన్‌ ఏఐ విలేజ్‌ వర్క్‌షాప్‌లో విన్నర్ ల వివరాలు ప్రకటిస్తుంది ట్విట్టర్. పాల్గొనదలిచిన వారు 2021 ఆగస్టు 6 లోగా ఎంట్రీ చేసుకోవాలి.