Two-Wheeler Loans : టూవీలర్ కొంటున్నారా? L&T భారీ లోన్ ఆఫర్.. డోంట్ మిస్..!

టూవీలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బైక్ లోను కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. టూవీలర్ కొనుగోలుదారుల కోసం L & T కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది.

Two-Wheeler Loans : టూవీలర్ కొంటున్నారా? L&T భారీ లోన్ ఆఫర్.. డోంట్ మిస్..!

Two Wheeler Loans Royal Enfield Partners With L&t Finance For Flexible Two Wheeler Loans (1)

Two-Wheeler Loans : టూవీలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బైక్ లోను కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. టూవీలర్ కొనుగోలుదారుల కోసం L & T కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. ‘Welcome 2022’ లో భాగంగా Bike కొనుగోలు చేసేవారికి భారీ మొత్తంలో లోన్‌ ఆఫర్‌ చేస్తోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలుదారులకు ఈ ఆఫర్ వడ్డీపై రాయితీని పొందవచ్చు.రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ఈ ‘Welcome 2022 లోన్‌ ఆఫర్ తీసుకొచ్చింది. భారత్‌లోని ప్రముఖ ద్విచక్ర వాహన ఫైనాన్షియర్‌లలో ఒకటైన L&T ఫైనాన్స్‌తో Royal Enfield భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

L&T కంపనీ ఈ స్కీమ్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు కేవలం మూడు నిమిషాల్లో 7.99 శాతం నుంచి వడ్డీ రేట్లతో అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రాయల్ ఎన్ ఫీల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లు 4 ఏళ్ల రీపేమెంట్‌పై వాహనం మొత్తం ధరలో 90 శాతం వరకు ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది. ఈ మేరకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బి. గోవిందరాజన్‌ పేర్కొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ డీలర్ల దగ్గర లేదా ఎల్‌‌ అండ్‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ బ్రాంచ్‌ దగ్గర ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను పొందవచ్చు. కంపెనీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ www.ltfs.com విజిట్ చేసి ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద లోన్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Meteor 350 cruiser, Interceptor 650, Continental GT 650 twins, హిమాలయన్ వంటి బైక్‌‌‌‌‌‌‌‌లను రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ సేల్ చేస్తోంది. ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్ ప్రకారం.. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ టర్నరౌండ్ టైమ్ (TAT)లో భాగంగా.. ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, రాయల్ ఎన్‌ఫీల్డ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లోని కస్టమర్‌లకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులపై లోన్లను అందిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో సరికొత్త క్లాసిక్ 350, మెటోర్ 350 క్రూయిజర్, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 ట్విన్స్, హిమాలయన్ అడ్వెంచర్ టూరర్, బుల్లెట్ 350 బుల్లెట్లపై లోన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇంకెందుకు త్వరపడండి.. తక్కువ వడ్డీకే లోన్ ఆఫర్ ద్వారా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు సొంతం చేసుకోవచ్చు.

Read Also : Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఆ మోడళ్ల ధరలు పెంచేసింది.. కొత్త ధర ఎంతంటే?