Aadhaar Card Fraud : ఆధార్ కార్డుతో మోసాలు.. UIDAI హెచ్చరిక!

ఆధార్ కార్డు వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటోంది యూఐడీఏఐ (UIDAI). ఈ మేరకు ఆధార్ యూజర్లకు హెచ్చరిస్తోంది. పాన్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే ఆధార్ కార్డు కీలకమైన డాక్యుమెంట్..

Aadhaar Card Fraud : ఆధార్ కార్డుతో మోసాలు.. UIDAI హెచ్చరిక!

Uidai Issues Notice Warning People Of Aadhaar Card Fraud

Aadhaar Card Fraud : ఆధార్ కార్డు వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటోంది యూఐడీఏఐ (UIDAI). ఈ మేరకు ఆధార్ యూజర్లకు హెచ్చరిస్తోంది. పాన్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే ఆధార్ కార్డు కీలకమైన డాక్యుమెంట్.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఆధార్ కార్డు మోసాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

ఆధార్ కార్డు కలిగినవారంతా అలర్ట్‌గా ఉండాలని సూచిస్తోంది యూఐడీఏఐ. ఎవరి ఆధార్ నెంబర్లను కూడా వెరిఫై చేయకుండా ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణనలోకి తీసుకొవద్దని సూచిస్తోంది. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తోంది. ఆఫ్‌లైన్‌లో అయితే ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా యూజర్లను అలర్ట్ చేసింది. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆధార్ కార్డు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ వెరిఫికేషన్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


ఆన్‌లైన్‌లో ఆధార్ https://resident.uidai.gov.in/verify ద్వారా మాత్రమే వెరిఫై చేసుకోవాలని సూచిస్తోంది. లేదంటే mAadhaar app ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చునని తెలిపింది. పబ్లిక్ కంప్యూటర్లలో ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. కాపీ చేసుకున్నాక వెంటనే డిలీట్ చేచేయాలని సూచించింది. ఆధార్ ఓటీపీ కూడా ఎవ్వరికీ చెప్పొద్దని తెలిపింది. మరొకరి మొబైల్ నెంబర్‌ను మీ ఆధార్‌కు అప్‌డేట్ చేయొద్దని సూచించింది. ఆధార్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటే టెలిఫోన్ నెంబర్ల 1947 (టోల్ ఫ్రీ) ద్వారా సంప్రదించాల్సిందిగా UIDAI సూచించింది. లేదంటే.. help@uidai.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. జూలై 8న UIDAI ట్విట్టర్ వేదికగా ఆధార్ యూజర్లను అలర్ట్ చేసింది.