Buy iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొనడం ఇప్పట్లో కష్టమే.. ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే..!

Buy iPhone 14 Pro : ప్రముఖ ఆపిల్ (Apple) సరఫరాదారు ఫాక్స్‌కాన్ (Foxconn) స్టాక్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. COVID-హిట్ జెంగ్‌జౌ ప్లాంట్ డిసెంబర్ చివరి నుంచి జనవరి ప్రారంభంలో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ భావిస్తోంది.

Buy iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొనడం ఇప్పట్లో కష్టమే.. ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే..!

Unable to buy iPhone 14 Pro_ Apple likely to fix stock issues by January 2023

Buy iPhone 14 Pro : ప్రముఖ ఆపిల్ (Apple) సరఫరాదారు ఫాక్స్‌కాన్ (Foxconn) స్టాక్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. COVID-హిట్ జెంగ్‌జౌ ప్లాంట్ డిసెంబర్ చివరి నుంచి జనవరి ప్రారంభంలో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ భావిస్తోంది. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడళ్లను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫాక్స్‌కాన్ నవంబర్‌లో ఏడాదికి 11.4 శాతం ఆదాయం పడిపోయిందని కంపెనీ తెలిపింది.

COVID-19 పరిమితుల నేపథ్యంలో చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో Apple డివైజ్ ఉత్పత్తిని భారీగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం, నవంబర్ అత్యంత ప్రభావితమైనప్పటికీ మొత్తం పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఫాక్స్కాన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. Apple సరఫరాదారు కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని యోచిస్తోంది. ఆపిల్ సరఫరాదారుకు ప్రభుత్వం సాయం చేస్తోందని తెలిపింది.

Read Also : iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!

Foxconn Zhengzhou ప్లాంట్ గత కొన్ని నెలలుగా COVID-19 పరిమితులతో పోరాడుతోంది. క్రిస్మస్, జనవరి లూనార్ న్యూఇయర్ సెలవులకు ముందు Apple డివైజ్‌ల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. పరిమితుల కారణంగా చాలా మంది ఫాక్స్‌కాన్ కార్మికులు ప్లాంట్‌ను విడిచిపెట్టారు. ఫాక్స్‌కాన్ 70 శాతం ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తుంది.

Unable to buy iPhone 14 Pro_ Apple likely to fix stock issues by January 2023

Unable to buy iPhone 14 Pro_ Apple likely to fix stock issues by January 2023

జెంగ్‌జౌ ప్లాంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌లతో సహా దాని ప్రీమియం మోడళ్లలో ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. ఫాక్స్‌కాన్‌కు సన్నిహిత వర్గాల ప్రకారం.. కొత్త సిబ్బంది నియామకంతో సామర్థ్యం ఇప్పుడు క్రమంగా తిరిగి మొదలవుతుంది. రిక్రూట్‌మెంట్ సజావుగా జరిగితే, పూర్తి ప్రొడక్టులను తిరిగి ప్రారంభించడానికి మూడు నుంచి నాలుగు వారాలు పట్టవచ్చునని తెలిపింది.

ఇంతలో, ఆపిల్ హై-ఎండ్ ఐఫోన్‌ల ప్రొడక్టులను భారత మార్కెట్లో మార్చేందుకు అవకాశాలను అన్వేషిస్తోంది. కంపెనీ ఇప్పటికే దేశంలో వెనీలా మోడల్‌లను అసెంబ్లింగ్ చేస్తోంది. ఈ డివైజ్‌లలో కొన్ని iPhone 12, iPhone 13, iPhone 14 మోడల్స్ ఉన్నాయి. మరో నివేదిక ప్రకారం.. కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం ఐప్యాడ్ ప్రొడక్టుల్లో కొన్ని భాగాలను చైనా నుంచి భారత్‌కు మార్చడానికి ఆప్షన్లను అన్వేషిస్తోంది. దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!