Two-Wheeler In April: సుజుకీ హయబుస, ఏప్రిల్లా లాంటి టాప్ మోడల్స్ ఏప్రిల్ 2021కి లాంచింగ్

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ గుర్తుండిపోతుంది. అప్‌కమింగ్ టూ వీలర్లను లాంచ్ చేయడమే మాకుండా ఉన్న వాటిని రీ మోడల్ చేసి మార్కెట్లోకి ..

Two-Wheeler In April: సుజుకీ హయబుస, ఏప్రిల్లా లాంటి టాప్ మోడల్స్ ఏప్రిల్ 2021కి లాంచింగ్

Upcoming Two Wheeler Launches In April 2021

Two-Wheeler In April: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ గుర్తుండిపోతుంది. అప్‌కమింగ్ టూ వీలర్లను లాంచ్ చేయడమే మాకుండా ఉన్న వాటిని రీ మోడల్ చేసి మార్కెట్లోకి దించుతున్నారు. Trident 660, Aprilia SXR 125, TVS 2021 Apache RR310, Suzuki Hayabusa లాంటి టాప్ మోడల్స్ లాంచింగ్ డేట్లతో ఊరిస్తున్నాయి.

Triumph Trident 660
2021 ఏప్రిల్ 6న ఈ మోడల్ మార్కెట్లోకి రానుంది. దాదాపు దీని ధర రూ.6.5 నుంచి రూ.7లక్షల వరకూ ఉండొచ్చని అంటున్నారు. Triumph roadster designను చూసి ఇన్‌స్పైర్ అయి ఈ డిజైన్ ను రెడీ చేశారు. ఫ్యూయెల్ ట్యాంక్ పై రబ్బర్ ప్యాడ్స్ తో.. రౌండ్ హెడ్ లైట్ ఉంచి భలేగా ముస్తాబు చేశారు. మూడు సిలిండర్ల ఇంజిన్ తో 660సీసీని రీప్లేస్ చేయనుంది. పైగా దీనికి 6స్పీడ్ గేర్లు ఉన్నాయట.

Trident 1

Trident 1

2021 Suzuki Hayabusa

Suzuki Hayabusa

Suzuki Hayabusa

హొయలు పోయే హయబుస.. సుజుకీ హయబుసను ఇదే నెలలో లాంచ్ చేయనున్నట్లు సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కన్ఫామ్ చేసింది. అప్‌డేటెడ్ డిజైన్ తో.. కొత్త ఫీచర్లతో, రీ వర్క్ డ్ ఇంజిన్ తో ముస్తాబైంది. కొత్త హయబుసకు మెరిసే అందాన్ని జోడించినా.. కాస్త పవర్, టార్క్ తక్కువగానూ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజితో నడుస్తుంది. 1340 సీసీతో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ లైన్ ఫోర్ ఇంజిన్ తో రెడీ అయింది. దీని ధర దాదాపు రూ.20లక్షలు ఆ మధ్యలో ఉండనుంది.

Aprilia SXR 125

Aprilla 3

Aprilla 3

పియాగియో ఇండియా అతి త్వరలో కొత్త 125సీసీ స్కూటర్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఎప్రిల్లా ఎస్ఎక్స్ఆర్ 125. ఒకవేళ ఈ బ్రాండ్ పై నమ్మకంతో కొత్త మోడల్ కు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ప్రీ బుకింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఒక రూ.5వేలతో ఎప్రిలా డీలర్ షిప్ లో బుక్ చేసుకోవచ్చు.

2021 TVS Apache RR 310

Tvs Apache 4

Tvs Apache 4

2017లో లాంచ్ అయినప్పటి నుంచి పీక్స్ లో క్రేజ్ సంపాదించుకుంది టీవీఎస్ అపాచీ. స్టార్టింగ్ మోడల్ కు ధీటుగా రెడీ అయిన ఈ మోడల్.. 2021 TVS Apache RR 310 ఏప్రిల్ 7న 2021లాంచ్ అవుతుంది. వైర్ టెక్నాలజీలో రైడింగ్ మోడ్స్ లో కూడా అర్బన్, ట్రాక్, స్పోర్ట్, రైన్ లాంటి వేరియషన్స్ ఉన్నాయి.

2021 KTM RC 390

Ktm 5

Ktm 5

ఆరు గేర్లతో కేటీఎమ్ ఆర్సీ 390 రెడీ అయింది. పాత మోడల్ ధరకే మార్కెట్లోకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మోడల్ లో సింగిల్ సిలిండర్ 373.2సీసీతో అప్ డేట్ అయింది.