UPI Lite Launched : పేటీఎంలో UPI Lite వచ్చేసిందోచ్.. ఇకపై యూపీఐతో ఇన్‌స్టంట్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎలా సెటప్ చేయాలంటే?

UPI Lite Launched : ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారం పేటీఎం (Paytm) ఇటీవల ప్లాట్‌ఫారమ్‌లో (UPI Lite) పేమెంట్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. మల్టీ లో-వాల్యూ UPI లావాదేవీలను వెంటనే పూర్తి చేసుకోవచ్చు.

UPI Lite Launched : పేటీఎంలో UPI Lite వచ్చేసిందోచ్.. ఇకపై యూపీఐతో ఇన్‌స్టంట్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎలా సెటప్ చేయాలంటే?

UPI Lite Launched What is it and how to setup and use it?

UPI Lite Launched : ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారం పేటీఎం (Paytm) ఇటీవల ప్లాట్‌ఫారమ్‌లో (UPI Lite) పేమెంట్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. మల్టీ లో-వాల్యూ UPI లావాదేవీలను వెంటనే పూర్తి చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మెరుగుపరిచడంలో యూజర్లకు సాయపడేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. UPI లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెప్టెంబర్ 2022లో UPI Life ఫీచర్ ప్రారంభించింది. మే 2022లో జారీ చేసిన NPCI సర్క్యులర్ ప్రకారం.. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం UPI లావాదేవీలలో 50 శాతం విలువ రూ. 200, అంతకంటే తక్కువగా ఉందని తేలింది.

UPI లావాదేవీల విలువ తక్కువగా ఉన్నప్పటికీ.. UPI సిస్టమ్ వినియోగం ఎక్కువగానే ఉంది. బ్యాంకుల్లో లావాదేవీల రద్దీ పెరగడం కారణంగా అనేకసార్లు పేమెంట్లు నిలిచిపోతాయి. అదనంగా, వినియోగదారులు పిన్‌లను యాడ్ చేసి పేమెంట్లు చేసేందుకుబ్యాంక్ దగ్గర వేచి ఉండవలసి ఉంటుంది. UPI పేమెంట్లకు కూడా అదే సమయం పడుతుంది. ఇన్‌స్టంట్ పేమెంట్లను ప్రారంభించడానికి బ్యాంకుల్లో రద్దీని తగ్గించడానికి UPI Lite ప్రవేశపెట్టింది. భీమ్ (BHIM) యాప్ ఇప్పటికే UPI లైట్ లావాదేవీలను అనుమతిస్తోంది. ఇటీవల Paytm ప్లాట్‌ఫారమ్‌లో UPI లైట్‌ను ప్రారంభించిన మొదటి డిజిటల్ పేమెంట్ల యాప్‌లలో ఒకటిగా నిలిచింది. అసలు UPI Lite అంటే ఏంటి? Paytmలో అదేలా సెటప్ చేయాలి అనే విషయాలను వివరంగా చూద్దాం.

UPI Lite అంటే ఏమిటి? :
UPI లైట్ వినియోగదారులను ‘On-Device’ వ్యాలెట్ ఉపయోగించి లావాదేవీలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. మీ పేటీఎంకు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు. UPI లైట్‌ని ఉపయోగించి లావాదేవీలను ప్రారంభించడానికి Paytm వ్యాలెట్లలో Paytm విషయంలో వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌కు క్యాష్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ని సెటప్ చేసిన తర్వాత UPI PINని యాడ్ చేయకుండా లేదా బ్యాంకులు లావాదేవీలను నిర్ధారించే వరకు వేచి ఉండకుండా అప్పటికప్పుడే రూ. 200 వరకు ఇన్‌స్టంట్ లావాదేవీలను చేసేందుకు UPI లైట్ వ్యాలెట్ యూజర్లకు అనుమతిస్తుంది.

UPI Lite Launched What is it and how to setup and use it?

UPI Lite Launched What is it and how to setup and use it?

Read Also : Top 5 Upcoming Cars 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? 2023లో టాప్ 5 అప్‌కమింగ్ కార్లు ఇవే.. ఏ కారు మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

ముఖ్యంగా, వినియోగదారులు UPI లైట్‌కి రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2వేల వరకు యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా రోజువారీ వినియోగాన్ని రూ. 4వేల వరకు చేయవచ్చు. అదనంగా, UPI లైట్‌తో, వినియోగదారులు బ్యాంక్ లావాదేవీల సంఖ్యపై రోజువారీ UPI లావాదేవీ పరిమితిపై ఆందోళన చెందక్కర్లేదు. మల్టీ లో-వాల్యూ UPI పేమెంట్లను నిర్వహించవచ్చు. ఈ విధంగా, UPI Lite తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీలను సులభతరం చేస్తుంది. అంతేకాదు.. వినియోగదారులు UPI బ్యాలెన్స్‌ని ఏ సమయంలో అయినా ఎలాంటి ఛార్జీలు లేకుండా అదే బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Paytmలో UPI Liteని ఎలా సెటప్ చేయాలంటే? :
– మీ iOS లేదా Android స్మార్ట్‌ఫోన్‌లో Paytm యాప్‌ని ఓపెన్ చేయండి.
– హోమ్ పేజీలో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న ‘Profile’ బటన్‌పై Tap చేయండి.
– ‘UPI & Payment Settings’ ఎంచుకుని, ఆపై ‘Other Settings’ విభాగంలో ‘UPI Lite’ ఎంచుకోండి.
– UPI లైట్‌కు అర్హత ఉన్న బ్యాంక్ అకౌంట్ ఎంచుకోండి.
– మీరు మీ UPI లైట్ అకౌంట్ యాడ్ చేసే మొత్తాన్ని ‘UPI Lite’ని యాక్టివ్ చేసేందుకు Cash లోడ్ చేయాలి.
– ఇప్పుడు మీ MPINని వెరిఫై చేసుకోవాలి. మీ UPI Lite అకౌంట్ క్రియేట్ ప్రాసెస్ పూర్తి చేయండి.

మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక్క ట్యాప్‌తో పేమెంట్లు చేయవచ్చు. UPI లైట్ చిన్న-విలువ లావాదేవీలతో బ్యాంక్ పాస్‌బుక్‌లను తగ్గించడంలో సాయపడుతుందని గమనించాలి. ఎందుకంటే ఈ లావాదేవీలు కేవలం Paytm బ్యాలెన్స్, హిస్టరీ సెక్షన్‌లో మాత్రమే కనిపిస్తాయి. బ్యాంక్ పాస్‌బుక్‌లో కాదని గమనించాలి.

Read Also : Apple Watch Blood Glucose Feature : రాబోయే రోజుల్లో ఆపిల్ వాచ్‌తోనే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు..? బ్లడ్ శాంపిల్ అక్కర్లేదు..!