UPI Transaction Limit : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా ప్రతిరోజూ ఎంతవరకు పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో పూర్తి వివరాలు మీకోసం..!

UPI transaction Limit : ప్రస్తుత డిజిటల్ పేమెంట్ ఫ్లాట్‌ఫారంలో ప్రతిఒక్కరూ యూపీఐ (UPI Payments) ద్వారా పేమెంట్లు చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే రోజువారీ UPI లావాదేవీలపై పరిమితి అమల్లోకి వచ్చింది.

UPI Transaction Limit : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా ప్రతిరోజూ ఎంతవరకు పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో పూర్తి వివరాలు మీకోసం..!

UPI transaction Limit _ This is how much you can spend using GPay, PhonePe, Paytm daily

UPI transaction Limit : ప్రస్తుత డిజిటల్ పేమెంట్ ఫ్లాట్‌ఫారంలో ప్రతిఒక్కరూ యూపీఐ (UPI Payments) ద్వారా పేమెంట్లు చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే రోజువారీ UPI లావాదేవీలపై పరిమితి అమల్లోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని ఏళ్ల క్రితమే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ప్రవేశపెట్టింది. ఈ ఇన్‌స్టంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అందరి జీవితాలను మార్చేసింది. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడం నుంచి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు డబ్బు బదిలీ చేయడం వరకు, UPI బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బు బదిలీలను సులభంగా పూర్తి చేయవచ్చు. కానీ, రోజువారీ బదిలీలపై పరిమితిని ప్రభుత్వం విధించింది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

UPI నగదు ట్రాన్స్‌ఫర్ లిమిట్ :
NPCI మార్గదర్శకాల ప్రకారం.. UPI ద్వారా వ్యక్తి రోజుకు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు చెల్లించవచ్చు. కెనరా బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు రూ. 25వేలు మాత్రమే అనుమతిస్తాయి. అయితే SBI వంటి పెద్ద బ్యాంకులు రోజువారీ UPI లావాదేవీల పరిమితిని రూ. 1,00,000కి తగ్గించింది. అయితే యూపీఐ లావాదేవీల పరిమితి బ్యాంకును బట్టి మారుతుంది.

రోజుకు UPI ట్రాన్స్‌ఫర్ లిమిట్ :
నగదు బదిలీ పరిమితితో పాటు, ఒక రోజులో నిర్వహించాల్సిన UPI బదిలీల సంఖ్యకు పరిమితి విధించింది. రోజువారీ UPI బదిలీ పరిమితి 20 లావాదేవీలకు తగ్గించింది. యూపీఐ పరిమితిని దాటిన తర్వాత.. లావాదేవీల పరిమితిని తిరిగి పొందాలంటే 24 గంటలు వేచి ఉండాలి. అయితే, బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం లావాదేవీల లిమిట్ మారవచ్చు. GPay, PhonePe ఇతరులతో సహా UPI పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌లలో రోజువారీ UPI బదిలీ పరిమితులను ఓసారి పరిశీలిద్దాం.

UPI transaction Limit _ This is how much you can spend using GPay, PhonePe, Paytm daily

UPI transaction Limit _ This is how much you can spend using GPay, PhonePe, Paytm daily

Read Also :  UPI Transaction Limit : గూగుల్ పే, పోన్‌పేతో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇకపై అన్‌లిమిటెడ్ పేమెంట్స్ చేయలేరు.. ఎందుకో తెలుసా?

GPay UPI ట్రాన్స్‌ఫర్ లిమిట్ :
Google Pay లేదా GPay అన్నిUPI యాప్‌లు, బ్యాంక్ అకౌంట్లలో మొత్తం 10 లావాదేవీ పరిమితులతో పాటు రోజుకు రూ. 10వేల వరకు రోజువారీ నగదు బదిలీలను అనుమతిస్తుంది. ముఖ్యంగా, ఎవరైనా రూ. 2వేల కన్నా ఎక్కువ డబ్బు రిక్వెస్టులను పంపితే GPay రోజువారీ లావాదేవీ లిమిట్ కూడా నిలిపివేస్తుంది.

PhonePe UPI ట్రాన్స్‌ఫర్ లిమిట్ :
PhonePe రోజువారీ UPI లావాదేవీ పరిమితిని రూ. లక్షకు సెట్ చేసింది. అయితే, ఈ పరిమితి బ్యాంకును బట్టి మారవచ్చు. ఒక వ్యక్తి బ్యాంక్ మార్గదర్శకాలను బట్టి PhonePe UPI ద్వారా రోజుకు గరిష్టంగా 10 లేదా 20 లావాదేవీలను కొనసాగించవచ్చు. GPay మాదిరిగానే, PhonePe కూడా రోజుకు రూ. 2వేల వరకు క్యాస్ ట్రాన్సాక్షన్లను అనుమతిస్తుంది.

Paytm UPI ట్రాన్స్‌ఫర్ లిమిట్ :
Paytm UPI యూజర్లకు రూ. 1 లక్ష వరకు నగదు బదిలీని అనుమతిస్తుంది. అయితే, యాప్ గంట, రోజువారీ నగదు బదిలీలపై కూడా లిమిట్ సెట్ చేసింది.

* Paytm రోజువారీ నగదు బదిలీ పరిమితి – రూ. 1,00,000
* Paytm గంటకు నగదు బదిలీ పరిమితి – రూ. 20,000
* Paytm గంటకు లావాదేవీల సంఖ్య – 5.
* Paytm రోజుకు లావాదేవీల సంఖ్య – 20

Amazon Pay UPI ట్రాన్సాక్షన్ లిమిట్ :
అమెజాన్ పే కూడా UPI ద్వారా గరిష్ట నగదు బదిలీ పరిమితిని రూ. లక్షగా నిర్ణయించింది. ముఖ్యంగా, Amazon Pay UPI కోసం నమోదు చేసుకున్న మొదటి 24 గంటల్లో యూజర్లు రూ. 5వేల వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరు. బ్యాంకును బట్టి రోజుకు లావాదేవీల సంఖ్య 20కి సెట్ చేసింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Moto G13 Smartphone : మోటోరోలా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!