Whatsapp: వాట్సప్‌లో కొత్త రంగుల్లో అంటూ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

Whatsapp: వాట్సప్‌లో కొత్త రంగుల్లో అంటూ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

WhatsApp

Whatsapp Link: సైబర్ నేరగాళ్లు.. వాట్సప్‌లో వైరస్ వ్యాప్తి చేయడం పనిగా పెట్టుకుని పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్‌ ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ, కొత్త రంగులో వాట్సాప్‌ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు వాట్సప్‌లో వస్తున్నాయి. వాస్తవానికి అవి వైరస్ లింక్‌లు.. వాట్సప్ కలర్ మారదు.. వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదు కూడా..


అయితే విషయం తెలియని చాలామంది లింక్ ఓపెన్ చేసి.. ఇబ్బందులు పడుతున్నారు. ‘పింక్‌ వాట్సాప్‌’ (Pink Whatsapp) అంటూ లింక్‌ వైరల్‌ అవుతోండగా.. ఇది వైరస్ లింక్ అని జాగ్రత్తగా ఉండాలంటూ టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Pinklook

పైన ఫొటోలో కనిపిస్తున్న లింకు వాట్సప్‌లో కనిపిస్తుంది. ఈ లింకులు క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని రాసున్నారు. కానీ ఆ లింక్ ఓపెన్ చేస్తే వైరస్ మీ ఫోన్‌లోకి చొరబడుతుంది. ఈ లింక్‌ వచ్చి ఉంటే.. ఫ్రెండ్సే పంపినా కూడా క్లిక్‌ చేయొద్దు. కొత్త వాట్సాప్‌ అంటూ ఏదైనా వస్తే వాట్సాప్‌ ప్లే స్టోర్‌ ద్వారానే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ఫేక్ లింక్ ఓపెన్ చేసి ఉంటే.. ఫోన్‌ను రీసెట్‌ చేయండి. మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు కూడా ఒకసారి మార్చుకుంటే మంచిది అని, ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మార్చుకుంటే మంచిదని అంటున్నారు.