Twitter: త్వరలో యూజర్లకు ట్విట్టర్ నుంచే షాపింగ్

ప్రస్తుతం ట్వీట్లు మాత్రమే చేసుకునేందుకు వీలున్న యూజర్లకు అతి త్వరలో యాప్ నుంచే షాపింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో మరికొద్ది రోజుల్లోనే షాపింగ్ ఫీచర్.. "ప్రొడక్ట్ డ్రాప్స్" తీసుకురానున్నారు.

Twitter: త్వరలో యూజర్లకు ట్విట్టర్ నుంచే షాపింగ్

How To Get Verified On Twitter, Process To Apply For A Verification Badge (1)

Twitter: ప్రస్తుతం ట్వీట్లు మాత్రమే చేసుకునేందుకు వీలున్న యూజర్లకు అతి త్వరలో యాప్ నుంచే షాపింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో మరికొద్ది రోజుల్లోనే షాపింగ్ ఫీచర్.. “ప్రొడక్ట్ డ్రాప్స్” తీసుకురానున్నారు.

అమ్మకానికి ముందే కొత్త ఫీచర్ బ్రాండ్ లను వినియోగదారులకు కనపడేలా చేస్తుంది. విడుదలకు ముందే సైన్ అప్ చేసుకున్న వారికి ఇన్ యాప్ నోటిఫికేషన్ ల ద్వారా రిమైండ్ కూడా చేస్తుంది. ప్రొడక్ట్ డ్రాప్స్ తో అపకమింగ్ లాంచ్ గురించి మర్చంట్ ట్వీట్ చేసినప్పుడు రిమైండ్ మీ అనే బటన్ కనిపిస్తుంది.

న్యూ ఫీచర్ పై ఒక్క క్లిక్ చేయడంతో ప్రొడక్ట్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా షాప్ ఆన్ వెబ్ సైట్ ఆప్షన్ కనిపిస్తుంది. అలా వెళ్లి కావాల్సిన ప్రొడక్ట్ కొనుగోలు చేసుకోవచ్చు. ట్విట్టర్ యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్ కూడా ఉంటుంది.

Read Also : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌.. మీకు ట్విట్టర్ సర్కిల్ ఉందో లేదో చూడాలంటే?