Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2పై రూ.9వేల వరకు తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్స్ (Vijay Sales Republic Day) ఇప్పుడు భారత మార్కెట్లో అందబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ లేటెస్టుగా ఆపిల్ iPhone 14, Galaxy Buds 2 TWS ఇయర్‌బడ్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2పై రూ.9వేల వరకు తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

Vijay Sales Republic Day Sale _ iPhone 14, Samsung Galaxy Buds 2 available with up to Rs 9,000 off

Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్స్ (Vijay Sales Republic Day) ఇప్పుడు భారత మార్కెట్లో అందబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ లేటెస్టుగా ఆపిల్ iPhone 14, Galaxy Buds 2 TWS ఇయర్‌బడ్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు డివైజ్‌లపై ధర భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే, కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లతో ధరను మరింత తగ్గించవచ్చు. ఐఫోన్ 14 మోడల్ ధర రూ. 79,900 నుంచి రూ. 74,900లకు సొంతం చేసుకోవచ్చు.

అదనంగా, HDFC బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు రూ. 4వేలు విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు, ఐఫోన్‌లతో పాటు Galaxy Buds 2 TWS ఇయర్‌బడ్‌లు రూ. 11,999 నుంచి తగ్గించి రూ. 5,999కి విక్రయిస్తున్నారు. Galaxy Buds 2 శాంసంగ్ ఫోన్‌లతో మెరుగ్గా పని చేస్తుంది. అయితే ఇతర Android ఫోన్‌లు, టాబ్లెట్‌లు Galaxy Buds యాప్‌కు సపోర్టు అందిస్తాయి. శాంసంగ్ బడ్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా బ్యాంక్ ఆఫర్ ఉంది.

మీరు ఇతర ఆపిల్ డివైజ్‌ల కోసం చూస్తున్నారా? ఐఫోన్ 13 మోడల్ బ్యాంక్ ఆఫర్‌లను మినహాయించి రూ. 64,900కు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 మోడల్‌పై బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా రూ. 59,900 వద్ద అందుబాటులో ఉంది. వినియోగదారులు Apple iPhoneలు, MacBooks, iPads, Apple Watches అలాగే AirPodలను కొనుగోలు చేసినప్పుడు Apple Care Plusపై 20 శాతం తగ్గింపును కూడా విజయ్ సేల్స్ అందిస్తోంది.

Vijay Sales Republic Day Sale _ iPhone 14, Samsung Galaxy Buds 2 available with up to Rs 9,000 off

Vijay Sales Republic Day Sale _ iPhone 14, Samsung Galaxy Buds 2

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈరోజే లాస్ట్ డేట్.. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్.. ఏ బ్రాండ్ ఫోన్ బెటర్ అంటే?

విజయ్ సేల్స్ కూడా అనేక గాడ్జెట్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్ సమయంలో అత్యధిక ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ A23 మోడల్ రూ. 23,990 ధర నుంచి తగ్గిపోయి రూ. 18,499 వద్ద అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy Tab A7 Lite Wifi టాబ్లెట్ రూ. 14,500కి బదులుగా రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఫైర్-బోల్ట్ నింజా కాల్ 2 స్మార్ట్‌వాచ్ రూ. 7,999 నుంచి తగ్గి రూ. 1,999కి అందుబాటులో ఉంది.

అంతేకాకుండా, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 11,490 ధరలో టీవీలను ఎంపిక చేసుకోవచ్చు. రూ. 3,499 నుంచి సౌండ్‌బార్‌లు, రూ. 3,299 నుంచి ప్రారంభమయ్యే హోమ్ ఆడియో సిస్టమ్‌ల నుంచి ఎంచుకోవచ్చు. కొన్ని బ్లూటూత్ స్పీకర్లు గరిష్టంగా 60 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ. 20వేల కన్నా ఎక్కువ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 3వేల వరకు 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 20వేల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ. 1,500 వరకు 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ జనవరి 25 నుంచి పొందవచ్చు. మెగా రిపబ్లిక్ డే సేల్ ఎప్పుడు ముగుస్తుందో వెబ్‌సైట్ స్పష్టంగా రివీల్ చేయలేదు. అయితే, ఆన్‌లైన్ సేల్ సమయంలో ధరలు హెచ్చుతగ్గుదల ఉంటాయని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.30వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!