Vivo V23e 5G Offer : వివో V23e స్మార్ట్ ఫోన్‌పై సమ్మర్ స్పెషల్ ఆఫర్.. రూ.5వేలు క్యాష్ బ్యాక్..!

Vivo V23e Offer : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియాలో V-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో Vivo V23e స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది.

Vivo V23e 5G Offer : వివో V23e స్మార్ట్ ఫోన్‌పై సమ్మర్ స్పెషల్ ఆఫర్.. రూ.5వేలు క్యాష్ బ్యాక్..!

Vivo Announces Summer Special Offer For V23e In India With Rs 5,000 Cashback On Select Bank Cards (1)

Vivo V23e Offer : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియాలో V-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో Vivo V23e స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ ప్రత్యేకంగా రూ. 5000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. V23e అనేది Vivo లేటెస్ట్ సెల్ఫీ-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ ప్యాకేజీ.. ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లు Vivo V23eని కొనుగోలు చేసే ICICI బ్యాంక్, SBI లేదా IDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. రూ. 5000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. వన్ కార్డ్ ఉన్నవారు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

క్యాష్‌బ్యాక్ ఆఫర్ మే 10 వరకు వర్తిస్తుంది. భారత మార్కెట్లో Vivo V23e 5G ధర కేవలం (8GB+128GB స్టోరేజ్ ఆప్షన్) రూ. 25,990గా వచ్చింది. ఫోన్ మిడ్‌నైట్ బ్లూ సన్‌షైన్ గోల్డ్ అనే రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ధరతో రూ.20,990లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోప్ స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Vivo V23e 44MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వచ్చింది. ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.44-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. కిందిభాగంలో MediaTek Dimensity 810 ప్రాసెసర్ కూడా ఉంది.

Vivo Announces Summer Special Offer For V23e In India With Rs 5,000 Cashback On Select Bank Cards (2)

Vivo Announces Summer Special Offer For V23e In India With Rs 5,000 Cashback  

మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచుకునేలా ఫోన్ సపోర్ట్‌తో వస్తుంది. వెనుకవైపు, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా ఉంది. అంతేకాదు.. 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక డివైజ్ 7.41mm వద్ద చాలా సన్నగా ఉంటుంది. 172 గ్రాముల బరువు ఉంటుంది. మొత్తం 4050 mAh సామర్థ్యంతో బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ బాక్స్ వెలుపల 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 30 నిమిషాల ఛార్జ్‌లో డివైజ్ 0 నుంచి 67 శాతం వరకు ఛార్జ్ అవుతుందని Vivo పేర్కొంది.

Read Also :  electric vehicles: బ్యాటరీ లోపాలతోనే ప్రమాదాలు: కేంద్ర కమిటీ