Vivo Budget Phone : రూ.10వేల లోపు ధరకే వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Vivo Budget Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అదే.. Vivo Y02 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. Vivo ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

Vivo Budget Phone : రూ.10వేల లోపు ధరకే వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Vivo launched a budget phone with 5000mAh battery, priced under Rs 10,000

Vivo Budget Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అదే.. Vivo Y02 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. Vivo ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. Vivo Y02 కొన్ని ముఖ్య ఫీచర్లలో 5000mAh బ్యాటరీ, HD+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, ముందు, వెనుక ప్యానెల్‌లలో ఒకే కెమెరా మరిన్ని ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Vivo Y02 ధర ఎంతంటే? :
Vivo Y02 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. దీని ధర రూ. 8,999గా ఉంది. ఈ ఫోన్ ధరను పరిశీలిస్తే.. కొత్త Vivo ఫోన్ రెడ్‌మి నంబర్ సిరీస్, రియల్‌మి C సిరీస్, Poco C సిరీస్‌ల మాదిరిగా ఉంటుంది.

Vivo Y02 స్పెసిఫికేషన్లు ఇవే :
సరసమైన ధరతో Vivo Y02 ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో వచ్చింది. MediaTek Helio P22 ప్రాసెసర్‌తో పాటు 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. స్టోరేజీ సపోర్టు ఉందా లేదా అనే దానిపై వివరాలు అందుబాటులో లేవు. సాఫ్ట్‌వేర్ FunTouchOS 12 స్కిన్ లేయర్‌తో Android 12 Go ఎడిషన్‌ను రన్ అవుతుంది. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ 6.51-అంగుళాల HD+ IPS LCD ప్యానెల్‌తో 720X1,600 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది.

Read Also : Vivo T1 5G : వివో T1 5G సిల్కీ వైట్ వేరియంట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవేనా? భారత్‌లో ధర ఎంతంటే?

కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా.. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఒకే 8-MP కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-MP ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంది. ఫేస్ బ్యూటీ, టైమ్ లాప్స్ వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. Vivo Y02 USB 2.0 పోర్ట్ ద్వారా 10W ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వచ్చింది. కొన్ని ఇతర ఫీచర్లు డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.0, Wi-Fi 5, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంది.

Vivo launched a budget phone with 5000mAh battery, priced under Rs 10,000

Vivo launched a budget phone with 5000mAh battery

మరోవైపు.. స్మార్ట్‌ఫోన్ Vivo X90 సిరీస్ చైనా మార్కెట్‌లోకి లాంచ్ అయింది. వివో X90 సిరీస్, Vivo కెమెరా-ఫోకస్డ్ X80 సిరీస్‌కి వెర్షన్. వివో X90 సిరీస్ కెమెరా స్పెక్స్, ఇంటీరియర్‌లతో వస్తుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ Vivo X90 సిరీస్ ఫుల్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేశారు.

వివో X90 సిరీస్‌లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro ప్లస్‌లతో సహా 3 ఫోన్‌లు ఉంటాయని టిప్‌స్టర్ వెల్లడించారు. టిప్‌స్టర్ అగర్వాల్ ప్రకారం.. Vivo X90 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్ప్లే 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది.

Vivo X90 డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పాటు LPDDR5 ర్యామ్, UFS4.0 స్టోరేజ్‌తో ఉంటుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారంగా OriginOS 3లో రన్ అవుతుంది. కెమెరా విభాగంలో Vivo X90 IMX866 50MP f/1.75 ప్రైమరీ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 12MP f/2.0 పోర్ట్రెయిట్ సెన్సార్, 12MP f/2.0 అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ డివైజ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని బరువు 195 గ్రాములు ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vivo V25 4G వేరియంట్ లాంచ్ అప్పుడే.. Vivo V25e ఫీచర్లతోనే రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చుంటే?