Vivo T1 5G : వివో నుంచి ఫస్ట్ T సిరీస్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

వివో నుంచి ఫస్ట్ T సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో ఇండియా భారత మార్కెట్లో మొట్టమొదటి Vivo T1 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.

Vivo T1 5G : వివో నుంచి ఫస్ట్ T సిరీస్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Vivo T1 5g Vivo Launches It

Vivo T1 5G : స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ మేకర్లు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. అందులో అగ్రగామిగా పేరొందిన కంపెనీల్లో షావోమీ తర్వాత మరో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కూడా ప్రపంచ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తోంది.

లేటెస్టుగా.. వివో నుంచి ఫస్ట్ T సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో ఇండియా భారత మార్కెట్లో మొట్టమొదటి Vivo T1 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకించి Vivo T1 5G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది.

ఇందులోని ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. TURBO Screenతో పాటు స్నాప్‌డ్రాగన్ 695 5G మొబైల్ ప్లాట్‌ఫారమ్‌తో 6nm చిప్‌సెట్‌తో వచ్చింది. 2.5D ఫ్లాట్ ఫ్రేమ్‌తో 8.25mm స్లిమ్ డిజైన్‌ కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తోంది.

Vivo T1 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ ఇన్-సెల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జర్‌తో పాటు 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా అందిస్తుంది. వివో స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం Vivo T1 5G ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకొచ్చింది.

ప్రాసెసర్ :
Vivo T1 5G 6nm స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో వస్తుంది. 4GB వరకు RAM (128GB ROM, FunTouch OS 12) సపోర్టు అందిస్తుంది.

కెమెరాలు :
Vivo T1 5G 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సూపర్ మాక్రో కెమెరా, 2MP బోకె కెమెరాను కలిగి ఉంది. 16MP సెల్ఫీ లెన్స్‌ అందిస్తోంది.

ధర ఎంతంటే? :
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, రెయిన్‌బో ఫాంటసీ రెండు కలర్లలో అందుబాటులో ఉంది. ఈ-స్టోర్, Flipkart.com అన్ని రిటైల్ స్టోర్‌లలో విక్రయిస్తోంది. Vivo T1 5G ధర రూ. 15,990 (4 GB + 128 GB), రూ. 16,990 (6GB + 128 GB), రూ. 19,990 (8GB + 128 GB) ధరకు అందుబాటులో ఉండనుంది.

Read Also : Tammareddy Bharadwaja: చిరంజీవి మా నాయకుడే.. కానీ సీఎంకు ఇదే నా విజ్ఞప్తి..: తమ్మారెడ్డి భరద్వాజ