Vivo V25 Pro Launch : వివో నుంచి రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌తో V25 Pro వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Vivo V25 Pro Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Vivo V25 Pro స్మార్ట్ ఫోన్.. భారత మార్కెట్లో రూ. 35,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి ఉంది.

Vivo V25 Pro Launch : వివో నుంచి రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌తో V25 Pro వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Vivo V25 Pro with colour changing back panel launched in India, price starts from Rs 35,999

Vivo V25 Pro Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Vivo V25 Pro స్మార్ట్ ఫోన్.. భారత మార్కెట్లో రూ. 35,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి ఉంది. 2022 జనవరిలో లాంచ్ అయిన Vivo V23 Pro స్మార్ట్‌ఫోన్‌కు కొత్త 5G ఫోన్ అడ్వాన్స్ మోడల్. ఆల్-రౌండర్ ఫోన్ కావాలనుకునే కస్టమర్లనే లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ మోడల్ లాంచ్ తీసుకొచ్చింది. అద్భుతమైన ఫోటోగ్రాఫ్‌లను ఇష్టపడే వారికి ఇదో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. Vivo V25 Pro స్మార్ట్ ఫోన్‌లోని ఫీచర్లు, స్పెషిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Vivo V25 Pro : ధర ఎంతంటే?
Vivo V25 Pro స్మార్ట్ ఫోన్ ధర 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 35,999గా నిర్ణయించింది. 12GB RAM + 1256GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 39,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్టు 25న సేల్ జరగనుంది. ఈ డివైజ్ సెయిలింగ్ బ్లూ, ప్యూర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. సేల్ ఆఫర్‌ల విషయానికొస్తే.. ఈ డివైజ్ ప్రీ-బుక్ చేసే వారు HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో రూ. 3,500 డిస్కౌంట్ ధరతో Vivo V25 Proని కొనుగోలు చేయవచ్చు. ప్రాథమికంగా ఒకరు హ్యాండ్‌సెట్‌ను రూ. 32,499 ప్రభావవంతమైన ధరతో కొనుగోలు చేయవచ్చు. 3వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.

Vivo V25 Pro with colour changing back panel launched in India, price starts from Rs 35,999

Vivo V25 Pro with colour changing back panel launched in India, price starts from Rs 35,999

Vivo V25 Pro: స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు
ఈ సరికొత్త Vivo V-Series ఫోన్ రంగులను మార్చే బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ప్రీమియం 3D కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మిడ్ రేంజ్ డివైజ్ 6.56-అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. ప్యానెల్ Full HD+ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. దీనికి HDR 10+ సర్టిఫికేషన్ కూడా ఉంది. Samsung Galaxy ఫోన్‌ల మాదిరిగానే సెంట్రలైజడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద.. ఈ డివైజ్ MediaTek డైమెన్సిటీ 1300 SoC ద్వారా పనిచేస్తుంది. కంపెనీ RAM విస్తరణ ఫీచర్‌ను (8GB వరకు) అందించింది.

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీతో హీట్ తగ్గించేందుకు వాటర్ కూలింగ్ VC సిస్టమ్ కూడా ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4,830mAh బ్యాటరీతో 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. OIS, EIS సపోర్టుతో 64-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 8-MP వైడ్-యాంగిల్ సెన్సార్, 2-MP మాక్రో సెన్సార్‌తో వచ్చింది. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా యాప్ నైట్ పోర్ట్రెయిట్, బోకే ఫ్లేర్ పోర్ట్రెయిట్, లైవ్ ఫోటో మరిన్ని ఫోటోగ్రఫీ ఫీచర్‌లను అందిస్తుంది.

Read Also : Vivo V25 Pro : వివో నుంచి V25 సిరీస్ వస్తోంది. లాంచ్‌కు ముందే ఫీచర్లు రివీల్.. కెమెరాలే ప్లస్!