Vivo X90 Series in India : ఇండియాకు వివో X90 సిరీస్ స్మార్ట్‌‌ఫోన్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo X90 Series in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. వివో X90 సిరీస్ (Vivo X90 Series in India)భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన వివో Vivo X80 సిరీస్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.

Vivo X90 Series in India : ఇండియాకు వివో X90 సిరీస్ స్మార్ట్‌‌ఫోన్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo X90 series to launch in India, likely to feature MediaTek Dimensity 9200 chipset

Vivo X90 Series in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. వివో X90 సిరీస్ (Vivo X90 Series in India)భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన వివో Vivo X80 సిరీస్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇప్పుడు చైనాలో అధికారికంగా Vivo X90 సిరీస్‌ను రిలీజ్ చేయనుంది. ఇదివరకే ఈ కొత్త సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు అలాంచ్ అవుతుంది అనేది రివీల్ చేయలేదు.

Vivo x80 సిరీస్ కెమెరా-ఫోకస్డ్ సిరీస్, Vivo X90 సిరీస్‌తో కూడా అదే ఫీచర్లతో వస్తుందని అంచనా. వివో X90 సిరీస్ ఫోన్.. BIS వెబ్‌సైట్‌లో V2218 మోడల్ నంబర్ కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ భారతీయ వేరియంట్‌లో చైనా వేరియంట్ మాదిరిగానే స్పెసిఫికేషన్‌లు ఉంటాయని లీక్ డేటా చెబుతోంది. వివో X90 సిరీస్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు ఎలా ఉండనున్నాయో ఓసారి పరిశీలిద్దాం.

Vivo X90 series to launch in India, likely to feature MediaTek Dimensity 9200 chipset

Vivo X90 series to launch in India, likely to feature MediaTek Dimensity 9200 chipset

వివో X90 సిరీస్ ధర ఎంతంటే? :
చైనాలో, Vivo X90 ప్రారంభ ధర RMB 3,699 వద్ద లాంచ్ అయింది. భారత మార్కెట్లో Vivo X90 Pro సిరీస్ ధర (8GB + 128GB వెర్షన్) రూ. 42,400గా ఉండనుంది. మరోవైపు, 8GB+256GB వేరియంట్ RMB 4999 (సుమారు రూ. 57,200) ధరతో లాంచ్ అయింది. లైన్ మోడల్ టాప్ 12GB వేరియంట్‌లో కూడా వస్తుంది. వివో X90 సిరీస్ ఫోన్ ధర (12GB + 256GB) RMB 6,499 (సుమారు రూ. 74,400) వద్ద లాంచ్ అయింది.

Read Also : Vivo V25 4G వేరియంట్ లాంచ్ అప్పుడే.. Vivo V25e ఫీచర్లతోనే రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్‌లు ఇవే :

వివో X90 సిరీస్ ఫోన్.. HDR10+తో 6.78-అంగుళాల AMOLED 120Hz డిస్‌ప్లే, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9200 చిప్‌తో పాటు 8GB వరకు RAMతో పనిచేస్తుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో aptX HD, Hi-Res ఆడియోకు సపోర్టు అందించే స్పీకర్‌లు కూడా ఉండనున్నాయి.

కెమెరాల విషయానికి వస్తే.. Vivo X90 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో OIS, EISతో కూడిన 50-MP IMX866 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2x ఆప్టికల్ జూమ్‌తో 12-MP పోర్ట్రెయిట్ సెన్సార్, 12-MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో కలిసి ఉంటుంది. ముందు భాగంలో 32-MP స్నాపర్ ఉండనుంది.

Vivo X90 series to launch in India, likely to feature MediaTek Dimensity 9200 chipset

Vivo X90 series to launch in India, likely to feature MediaTek Dimensity 9200 chipset

వివో X90 6.78 అంగుళాల సైజుతో రానుంది. 2K రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2160Hz PWM, HDR10+, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌సెట్, 4,870mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించింది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. Hi-Res ఆడియోకు అలాగే aptX-HDకి సపోర్టు అందిస్తుంది. వెనుకవైపు, ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS, EISతో కూడిన 50-MP IMX866 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. f/1.6 ఎపర్చరు, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో రానుంది. సెటప్‌లో 12-MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 32-MP సెన్సార్‌‌తో రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vivo Budget Phone : రూ.10వేల లోపు ధరకే వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!