VLC Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. డౌన్‌లోడ్‌కి అందుబాటులోకి వచ్చిన సర్వీస్

వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ దీనిపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వీస్‌ను ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం నిలిపివేసింది.

VLC Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. డౌన్‌లోడ్‌కి అందుబాటులోకి వచ్చిన సర్వీస్

VLC Player: దేశంలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. దీంతో వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. మల్టీ మీడియా ప్లేయర్‌గా వీఎల్‌సీకి దేశంలో మంచి ఆదరణ ఉంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ దీనిపై నిషేధం విధించింది.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

దీనిపై కేంద్రం ఎందుకు నిషేధం విధించి అనేదానిపై కచ్చితమైన కారణాలు తెలియదు. తాజాగా వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు ఈ సర్వీస్ భారత యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వీడియోలాన్ వెబ్‌సైట్ నుంచి యూజర్లు వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై విధించిన నిషేధంపై ఆ సంస్థ చట్టాన్ని ఆశ్రయించింది. గత అక్టోబర్‌లో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తమ సర్వీసుపై ఎందుకు నిషేధం విధించారో తెలపాలని ఆ నోటీసులో కోరింది.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి ముస్లింల షాక్.. నల్ల జెండాలతో నిరసన.. మోదీ నినాదాలు

లేదంటే చట్టప్రకారం కేంద్రంపై పోరాడుతామని ప్రకటించింది. తమ హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటామని చెప్పింది. దీనిపై స్పందించిన కేంద్రం ఈ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ డౌన్‌లోడ్స్ భారీగా జరిగేవి. ఇంతకుముందు ప్రతి సంవత్సరం సగటున 25 మిలియన్ల డౌన్‌లోడ్స్ ఉండేవని కంపెనీ తెలిపింది.