5G speedలో వొడాఫోన్ ఐడియానే బెస్ట్.. అందనంత దూరంలో జియో, ఎయిర్‌టెల్!

భారతదేశంలో 5G ట్రయల్: నష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vi) 5G ట్రయల్ సమయంలో భారతదేశంలో అత్యధిక వేగాన్ని కనబరుస్తోంది.

5G speedలో వొడాఫోన్ ఐడియానే బెస్ట్.. అందనంత దూరంలో జియో, ఎయిర్‌టెల్!

Vi (1)

5G speed: భారతదేశంలో 5G ట్రయల్: నష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vi) 5G ట్రయల్ సమయంలో భారతదేశంలో అత్యధిక వేగాన్ని కనబరుస్తోంది. Vi ఆదివారం మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన 5G ట్రయల్ సమయంలో 3.7 Gbps వేగాన్ని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇది భారతదేశంలోని టెలికాం సర్వీస్‌లోనే అత్యధిక వేగం. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. గాంధీనగర్ మరియు పూణేలోని మిడ్-బ్యాండ్ స్పెక్ట్రంలో 1.5 Gbps డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది.

Vi (Vodafone Idea)కు టెలికమ్యూనికేషన్స్ శాఖ ద్వారా 26 గిగాహెర్ట్జ్ (Ghz) ​​వంటి అధిక-ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు కేటాయించారు. అలాగే 5G నెట్‌వర్క్‌ల ట్రయల్స్ కోసం సాంప్రదాయ 3.5 GHz స్పెక్ట్రం బ్యాండ్ కేటాయించింది. ట్రయల్స్ సమయంలో, Vi తక్కువ టైమ్‌లోనే mmWave (milliwave) స్పెక్ట్రం బ్యాండ్‌లో 3.7 Gbps గరిష్ట వేగాన్ని సాధించింది.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ 5G దరఖాస్తులు మేలో DoT ద్వారా ఆమోదించబడ్డాయి. దీని తరువాత MTNL ఆమోదించబడింది. 5G ట్రయల్ కోసం అనుమతి టెలికాం కంపెనీలకు 6 నెలల పాటు ఇచ్చారు. టెలికాం కంపెనీలు ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్ మరియు సి-డాట్ సహకారంతో 5జీ ట్రయల్స్ చేస్తున్నాయి.

Vi కంటే వెనుకంజలో జియో, ఎయిర్‌టెల్:
Viకి ముందు, Jio జూన్‌లో 5G ట్రయల్ సమయంలో 1 gbps గరిష్ట వేగాన్ని సాధించింది. దీని తర్వాత ఎయిర్‌టెల్ జూలైలో 1 Gbps గరిష్ట వేగాన్ని సాధించింది. కానీ ఇప్పుడు Vi 3.7 Gbps వేగాన్ని చూపిస్తుంది. Vi కంటే మిగిలిన రెండు కంపెనీలు వెనుకబడి ఉండగా.. రిలయన్స్ జియో 5 జీ ట్రయల్స్ కోసం తన సొంత టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అన్ని ప్రైవేట్ ప్లేయర్‌లు ప్రస్తుతం 4G సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.