ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో టెస్లాకు ఆడి,వోక్స్ వ్యాగన్ ఛాలెంజ్

ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో టెస్లాకు ఆడి,వోక్స్ వ్యాగన్ ఛాలెంజ్

Volkswagen and Audi challenge Tesla : ప్రపంచంలోనే అతిపెద్ద కారు మేకర్ వోక్స్ వ్యాగన్, జర్మన్ ఆటోమొబైల్ ఆడి కార్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అగ్రగామి టెస్లాకు సవాల్ విసురుతున్నాయి. 2020లో వోక్స్ వ్యాగన్ (VLKAF) కంపెనీ 231,600 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. టెస్లా (TSLA) రికార్డు సేల్స్ లో సగానికి కంటే తక్కువ మొత్తంలోనే సేల్స్ నమోదు చేసింది. అయినప్పటికీ గత ఏడాదిలో 214శాతంతో జర్మనీ అతిపెద్ద ఆటో ఇండస్ట్రీ కంపెనీ వోక్స్ వ్యాగన్ సేల్స్ పెరిగాయి. తద్వారా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో అగ్రగామి అయిన టెస్లాకు గట్టి పోటీ ఇచ్చేందుకు వోక్స్ వ్యాగన్ రెడీ అవుతోంది.

బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లీడింగ్ కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వ్యోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్ సీఈఓ రైఫ్ బ్రాండ్ సట్టార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వోక్స్ వ్యాగన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎంతో పాపులర్ కంపెనీ. ఇటీవలే వ్యోక్స్ వ్యాగన్ నుంచి ID.3 కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే 56,500 యూనిట్లు అమ్ముడుబోయాయి. కాంప్యాక్ట్ e-Golf ,e-up సేల్స్ వరుసగా 41,300, 22,200 వరకు పెరిగాయి.

లగ్జరీ బ్రాండ్ కార్లలో ఆడి గ్రూపు కంపెనీ e-tron SUV కారు, స్పోర్ట్ బ్యాక్ మోడల్స్ 47,300లకు అమ్ముడుబోయాయి. మరోవైపు 20వేల ఎలక్ట్రిక్ Porsche Taycans కార్లను కస్టమర్లు కొనుగోలు చేశారు. హైబ్రిడ్ వాహనాల్లో ఎలక్ట్రిక్, కన్వెన్షనల్ ప్యూయల్ వాహనలు ఎంతో పవర్ ఫుల్.. గత ఏడాదిలో వోక్స్ వ్యాగన్ 190,500 ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ కార్లను అమ్మేసింది. 2019లో కార్ల సేల్స్ 175శాతం మేర పెరిగింది.

ఎలక్ట్రిక్ మొబిలిటీలో 2020 ఏఢాది వోక్స్ వ్యాగన్ కార్ల సేల్స్ కు టర్నింగ్ పాయింట్ అంటూ కంపెనీ సీఈఓ బ్రాడ్ స్టాట్టర్ పేర్కొన్నారు. వోక్స్ వ్యాగన్ కంటే ధీటుగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టెస్లా పోటీదారు కంపెనీలకు సవాళ్లను విసురుతోంది. ఎలన్ మస్క్ నేతృత్వంలో దూసుకెళ్తున్న టెస్లా కంపెనీ 2020లో 5 లక్షల కార్లను తయారుచేసింది. 2019 నుంచి మూడో వంతు కార్ల ఉత్పత్తి, డెలివరీలు పెరిగాయని నివేదిక పేర్కొంది.