రయ్.. రయ్.. : ఆపిల్ వైట్ కారు చూశారా? ఎలా మెరిసిపోతుందో?

రయ్.. రయ్.. : ఆపిల్ వైట్ కారు చూశారా? ఎలా మెరిసిపోతుందో?

Watch How A Shiny, Sleek White Car By iPhone Makers : ఆపిల్ వైట్ కారు వచ్చేసింది.. తెల్లగా మిలమిల మెరిసిపోతోంది.. ట్రాక్ బాల్ చక్రాలతో రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తుతోంది. ఐఫోన్ మేకర్లు తయారుచేసిన ఈ ఆపిల్ వైట్ కారు సోషల్ మీడియాలో వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. నెటిజన్లంతా వావ్ వాట్ ఏ కారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కనిపించిన ఆపిల్ కారు.. 3D మోడల్ మెర్సిడిస్ కాన్సెప్ట్ కారు. Mercedes-Benz AMG Vision Gran Turismo కారు ఫ్రంట్ సైడ్‌లో ఆపిల్ లోగో అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.

గోళాకార చక్రాలతో ఆపిల్ వైట్ కారు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆపిల్ కంపెనీ ఎప్పటినుంచో కారు తయారు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆపిల్ కారు లాంచింగ్ తేదీలపై కూడా సరైన స్పష్టత లేదు. ఏదిఏమైనా ఆపిల్ 2024లో సెల్ఫ్ డ్రైవింగ్ ప్యాసింజర్ వెహికల్స్ లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

2014లో ప్రారంభమైన Titan ప్రాజెక్టులో భాగంగా 1,000 మంది వర్కర్లతో ఆపిల్ కారు ప్రొడక్షన్ ప్రారంభమైంది. 2016లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి డెవలప్ మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో ఆపిల్ వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఆపిల్ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ జడెస్కీ కూడా వ్యక్తిగత కారణాలతో టైటాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ రోల్‌ను ఆపిల్ సుదీర్ఘ ఎగ్జిక్యూటీవ్ అయిన Bob Mansfield అందుకున్నారు.


ఈ ప్రాజెక్టులో కొత్త ప్లాన్లను అమలు చేశారు. ఈ ఏడాదిలో Mansfield, John Giannandrea రిటైర్ కావడంతో వారి స్థానంలో ఆపిల్ ఏఐ, మిషన్ లెర్నింగ్ చీఫ్ అపాయింట్ అయ్యారు. గత మూడేళ్లలో ఆపిల్.. కాలిఫోర్నియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కారును టెస్టింగ్ చేస్తోంది. క్యుపర్టినోలో వీధుల్లో SUVs కార్లు దర్శనమిచ్చాయని MacRumors నివేదిక తెలిపింది.