Vajrapaat App : పిడుగులను ముందే పసిగట్టే కొత్త యాప్.. ‘వజ్రపాత్’ వచ్చేసింది..

వర్షం పడేటప్పుడు మెరుపు మెరుస్తుంది.. ఆ తర్వాత ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దంతో ఉరుములు సంభవిస్తుంటాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణమే.. కానీ, అకస్మాత్తుగా పిడుగులు పడితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.

Vajrapaat App : పిడుగులను ముందే పసిగట్టే కొత్త యాప్.. ‘వజ్రపాత్’ వచ్చేసింది..

Vajrapaat App Launched For The Information Of Thunderstorms

Vajrapaat app information of thunderstorms : వర్షం పడేటప్పుడు మెరుపు మెరుస్తుంది.. ఆ తర్వాత ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దంతో ఉరుములు సంభవిస్తుంటాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణమే.. కానీ, అకస్మాత్తుగా పిడుగులు పడితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో పిడుగులు పడే చోట చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పిడుగుల వంటి విపత్కర పరిస్ధితుల నుంచి పిడుగుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకునే సరికొత్త టెక్నాలజీ వచ్చింది.

వజ్రపాత్ యాప్.. అయితే ఈ పిడుగులను ముందుగానే పసిగట్టే ఓ కొత్త యాప్ వచ్చింది. అదే.. వజ్రపాత్ (Vajrapaat) యాప్.. ఈ యాప్ ద్వారా ముుందుగానే పిడుగు పడే చోటును గుర్తించవచ్చు. ఈ యాప్‌ను కేంద్ర, రాష్ట్ర విపత్తుల నివారణ సంస్ధ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా పిడుగుపాటు ముప్పు సమాచారాన్ని ముందే తెలుసుకుని ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.

ప్రధానంగా వర్షాలు పడేసమయంలో పంటపొలాల్లోపనులు చేసుకునే వారు దగ్గరలో ఉన్న ఎత్తైన చెట్లక్రిందకు వెళ్తుంటారు. అప్పుడు ఆ చెట్లపై పిడుగుల పడటం వారంతా ప్రాణాలు కోల్పోవడం వంటి అనేక ఘటనలు జరిగాయి. పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా ప్రతిఏటా పెద్ద సంఖ్యలో మనుషులతోపాటు, పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోన్‌లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అన్ని అనుమతులు మంజూరు చేస్తే.. పిడుగులు ఎక్కడ పడతాయో ముందుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే పిడుగులు ఖచ్చితంగా ఏప్రాంతంలో పడనున్నాయో కూడా తెలుసుకోవచ్చు.