Google Bard AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐకి పోటీగా.. గూగుల్ బార్డ్ ఏఐ.. భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!

Google Bard AI : గూగుల్ (Google I/O) ఈవెంట్‌లో (Google Bard) అనే జనరేటివ్ AI కొత్త వెర్షన్ వెల్లడించింది. Bing AI, ChatGPT మాదిరిగానే Bard AI పనిచేస్తుంది. అసలు బార్డ్ AI అంటే ఏమిటి? ఏయే దేశాల్లో అందుబాటులో ఉంది? భారత్‌‌లో ఎలా యాక్సెస్ చేస్తారో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Google Bard AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐకి పోటీగా.. గూగుల్ బార్డ్ ఏఐ.. భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!

What is Google Bard AI, where is it available, how to use it in India and everything else you need to know

Google Bard AI : ప్రపంచమంతా జనరేటివ్ AIతో సరికొత్త ప్రయోగాలను చేస్తోంది. ఏఐ టెక్నాలజీ రేసులో అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా ఏఐ టెక్నాజీలో రేసులో దూసుకెళ్తోంది. ప్రపంచ మార్కెట్లో OpenAI ఏఐ టూల్ ChatGPT, Bing AI అత్యంత పాపులర్ అయ్యాయి. ఇప్పుడు గూగుల్ కూడా అదే తరహాలో సొంత ఏఐ టూల్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే AI-ఆధారిత చాట్‌బాట్ బార్డ్‌ ఏఐ (Bard AI) ఆవిష్కరించింది.

అయితే, ఈ ఏఐ టూల్ ప్రారంభించిన సమయంలో బార్డ్ అనేక పరిమితులను కలిగి ఉంది. కొంతమంది టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, చివరికి, గూగుల్ యూకే, అమెరికాలోని యూజర్ల కోసం బార్డ్ యాక్సెస్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ వార్షిక మెగా ఈవెంట్, (Google I/O) సందర్భంగా టెక్ దిగ్గజం బార్డ్ నిరీక్షణకు తెరదించింది. ఇప్పుడు అందరికీ బార్డ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది. భారత్‌లో కూడా గూగుల్ బార్డ్ ఏఐ అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని సాధారణ దశలను ఫాలో కావడం ద్వారా Google Bardని ఉపయోగించవచ్చు.

What is Google Bard AI, where is it available, how to use it in India and everything else you need to know

What is Google Bard AI, where is it available, how to use it in India

గూగుల్ బార్డ్ అంటే ఏమిటి? :
2023 ఫిబ్రవరిలో గూగుల్ గూగుల్ బార్డ్ ఏఐ టూల్ ఆవిష్కరించింది. ఇదో సంభాషణాత్మక AI చాట్‌బాట్. ఇప్పటికే మార్కెట్లో ఉన్న OpenAI ChatGPT, Microsoft Bing మాదిరిగానే పనిచేస్తుంది. AI-ఆధారిత చాట్‌బాట్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారాన్ని సెర్చ్ చేయడం, కోడింగ్ సమస్యలను పరిష్కరించడంలో సాయపడుతుంది. కంటెంట్ ఆలోచనలతో సహా మరిన్నింటిని అందించడంలో ఈ ఏఐ టూల్ సాయపడుతుంది. బింగ్ ఏఐ, చాట్ జీపీటీ అనే రెండు కొత్త చాట్‌బాట్‌లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సమయంలోనే గూగుల్ కూడా బార్డ్ ఏఐని ప్రకటించబడింది. మరో మాటలో చెప్పాలంటే.. ChatGPT మాదిరిగా బార్డ్ AI కూడా ఒక బిగ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అని చెప్పవచ్చు. అధిక మొత్తంలో డేటాను యాక్సస్ చేసుకోవచ్చు. ఆ డేటా నుంచి వినియోగదారులతో చాట్ చేయడానికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది.

What is Google Bard AI, where is it available, how to use it in India and everything else you need to know

What is Google Bard AI, where is it available, how to use it in India

గత మార్చిలో వినియోగదారుల కోసం బార్డ్ ఏఐ పబ్లిక్ యాక్సెస్ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో, బార్డ్ యూకే, అమెరికాలోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పుడు బార్డ్‌కి యాక్సస్ పొందాలంటే.. వెయిట్‌లిస్ట్‌లో సైన్ అప్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు, AI-ఆధారిత చాట్‌బాట్ భారత్ సహా 180 కన్నా ఎక్కువ దేశాల్లోని వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. ఇకపై వెయిట్‌లిస్ట్ ఉండదు. ఎవరైనా ఈజీగా బార్డ్ ఏఐని యాక్సస్ చేసుకోవచ్చు. బార్డ్ ఏఐ ఇప్పుడు టెక్ దిగ్గజం కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాంగ్వేజ్ మోడల్, (PalM 2) ద్వారా రన్ అవుతుందని Google I/O ఈవెంట్ సందర్భంగా గూగుల్ వెల్లడించింది. భవిష్యత్తులో, బార్డ్ ఏఐ కొన్ని ప్రధాన అప్‌డేట్లను కూడా పొందనుంది.

భారత్‌లో గూగుల్ బార్డ్‌ని ఎలా యాక్సెస్ చేయాలంటే? :
బార్డ్‌ని యాక్సెస్ చేసేందుకు మీరు (bard.google.com)కి విజిట్ చేయాలి. చాట్‌బాట్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందనే మెసేజ్ మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ‘Try Bard’ అనే ఒక ఆప్షన్ చూడవచ్చు. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి కంపెనీ ప్రైవసీ విధానాన్ని (Accept) అంగీకరించండి. అంతే.. బార్డ్ ఏఐ యాక్సస్ అయినట్టే.. ఇప్పుడు మీరు బార్డ్ చాట్‌బాట్‌ను ఉయోగించవచ్చు. బార్డ్ చాట్ విండో టాప్ లెఫ్ట్ సైడ్‌లో బార్డ్ పక్కనే ‘Experiment’ అనే ఆప్షన్ చూడొచ్చు. దీనికి అదనంగా, ప్రాంప్ట్ బార్ దిగువన ‘గూగుల్ వ్యూలను సూచించని సరికాని లేదా అభ్యంతరకరమైన సమాచారాన్ని బార్డ్ డిస్‌ప్లే చేయవచ్చు’ అని ఇలా చిన్న మెసేజ్ కనిపిస్తుంది.

Read Also : AI ChatGPT : భవిష్యత్తులో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే ఆధిపత్యమా? అంటే.. ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందంటే?

మరిన్ని దేశాల్లో బార్డ్ యాక్సస్ అందుబాటులో ఉందని గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. ఈ చాట్‌బాట్ ఎలా పనిచేస్తుందో ప్రయత్నించి మీ అభిప్రాయాలను తెలియజేయాలని పోస్టులో సూచించింది. వెయిట్‌లిస్ట్‌తో అవసరం లేదు. భారత్ సహా 180కి పైగా దేశాలు, తమ భూభాగాల్లో బార్డ్‌ను ఉపయోగించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాల్లోకి గూగుల్ బార్డ్ అందుబాటులోకి రానుందని గూగుల్ పేర్కొంది. అంతేకాదు.. బార్డ్ ఏఐ రాబోయే రోజుల్లో మరో 40 ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి, బార్డ్ ఇప్పటికే జపనీస్, కొరియన్ భాషలలో అందుబాటులో ఉంది.

What is Google Bard AI, where is it available, how to use it in India and everything else you need to know (1)

What is Google Bard AI, where is it available, how to use it in India

గూగుల్ బార్డ్ ప్రైవసీ పాలసీ నిబంధనలు :
బార్డ్‌ని యాక్సెస్ చేయాలంటే.. వినియోగదారులు ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలలో బార్డ్ ప్రతిస్పందనలు సరికానివి లేదా తగనివిగా ఉండవచ్చని, బార్డ్ ప్రతిస్పందనలను మెరుగుపరచేందుకు యూజర్ల అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని గూగుల్ పేర్కొంది. బార్డ్‌తో వినియోగదారుల సంభాషణ డేటాతో పాటు ‘సంబంధిత ఉత్పత్తి వినియోగ సమాచారం, వినియోగదారు సాధారణ ప్రాంతం, వారి అభిప్రాయాన్ని గూగుల్ సేకరిస్తుంది అని కూడా పాలసీ పేర్కొంది. గూగుల్ ప్రొడక్టులు, సర్వీసులను అలాగే మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచేందుకు డేటాను ఉపయోగిస్తుంది. డిఫాల్ట్ సెట్టింగ్‌ల ప్రకారం.. ఈ డేటా 18 నెలల వరకు వినియోగదారుల గూగుల్ అకౌంట్లో స్టోర్ అవుతుంది.

అయితే, వినియోగదారులు ఆటోమాటిక్‌గా తొలగించే లేదా ఆటో-డిలీట్ ఆప్షన్ వ్యవధిని 3 లేదా 36 నెలలకు మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. బార్డ్‌తో చాట్ చేసే ఇతరుల డేటాను చేర్చవద్దని కూడా పాలసీ యూజర్లను హెచ్చరిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసేందుకు గూగుల్ అనేక ఆప్షన్లను అందిస్తోంది. బార్డ్‌తో మీ చాట్‌ను ఇతరలకు కనిపించకుండా ఉండేందుకు గూగుల్ అకౌంట్ నుంచి డిస్‌కనెక్ట్ చేసుకోవచ్చు. మీ బార్డ్ చాటింగ్‌లో మిమ్మల్ని లేదా ఇతరులను గుర్తించే సమాచారాన్ని చేర్చవద్దని గూగుల్ పాలసీలో పేర్కొంది. అంతేకాకుండా, వైద్య, న్యాయ, ఆర్థిక లేదా ఇతర వృత్తిపరమైన సలహాల కోసం బార్డ్ ప్రతిస్పందనలపై ఆధారపడవద్దని కూడా గూగుల్ బార్డ్ వినియోగదారులకు పలు సూచనలు చేస్తోంది.

What is Google Bard AI, where is it available, how to use it in India and everything else you need to know

What is Google Bard AI, where is it available, how to use it in India

గూగుల్ బార్డ్ రాబోయే ఫీచర్లు ఇవే :
బార్డ్ స్టోర్‌లో కొన్ని కొత్త ఫీచర్‌లను కూడా అందిస్తుంది. Google I/O ఈవెంట్‌లో గూగుల్ ఇదే విషయాన్ని ప్రకటించింది. టెక్స్ట్‌తో పాటు ఫొటోలను కూడా చేర్చనుంది. టెక్స్ట్‌తో పాటు, మీరు అన్వేషిస్తున్న విషయం గురించి మరింత మెరుగైన భావాన్ని అందిస్తుంది. మీకు రిచ్ విజువల్స్‌తో పాటు లోతైన సమాచారాన్ని అందిస్తుందని గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్టులో తెలిపింది. కేవలం రెస్పాన్స్ మాత్రమే కాదు.. యూజర్ల ప్రాంప్ట్‌లు కూడా భవిష్యత్తులో ఫొటోలను చేర్చవచ్చు. గూగుల్ లెన్స్ (Google Lens) టూల్స్ కూడా ఉపయోగించేలా గూగుల్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. డాక్స్ (Docs),డ్రైవ్ (Drive), Gmail, Maps ఇతర గూగుల్ యాప్‌లతో కూడా బార్డ్ ఇంటిగ్రేట్ అవుతుంది. AI చాట్‌బాట్, Adobe Firefly సాయంతో ఇది వర్క్ అవుతుంది. Bing AI ఇమేజ్ జనరేటర్ మాదిరిగా ఫొటోలను కూడా రూపొందించవచ్చు.

Read Also : Google Topic Filters : గూగుల్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త ‘టాపిక్ ఫిల్టర్స్’ ఫీచర్.. మీ టాపిక్ ఇలా సెర్చ్ చేస్తే చాలు..!