WhatsApp Accounts : వాట్సాప్‌‌లో మీ నెంబర్ బ్యాన్ అయ్యిందా..మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్లకు మెసేజ్ లు పంపడం, వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ చేయడం లాంటివి దృష్టికి వస్తే..వెంటనే ఆ నంబర్ ను బ్యాన్ చేసేస్తోంది.

WhatsApp Accounts : వాట్సాప్‌‌లో మీ నెంబర్ బ్యాన్ అయ్యిందా..మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

Whatsapp

WhatsApp Accounts Banned : సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషించే వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. అయిత…నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నుంచి దాదాపు రెండు కోట్ల వాట్సాప్ అకౌంట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే..అసలు ఎందుకు బ్యాన్ చేస్తుందనే కారణాలు కొంతమందికి తెలియడం లేదు. కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్లకు మెసేజ్ లు పంపడం, వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ చేయడం లాంటివి దృష్టికి వస్తే..వెంటనే ఆ నంబర్ ను బ్యాన్ చేసేస్తోంది.

Read More : Odisha Congress : విద్యార్థులపై విరిగిన లాఠీ..వెంబడించి మరీ కొట్టారు

కాంటాక్ట్ నంబర్ ను సేవ్ చేసుకున్న తర్వాతే…ఛాటింగ్ చేయాలని సూచిస్తోంది. అడ్డగోలు కాంటాక్ట్ లను సేవ్ చేసుకోవడం, అవసరం లేకున్నా..వాళ్లకు మెసేజ్ లు పంపడం..ఫార్వర్డ్ మెసేజ్ లను పంపడం చేయడం తగ్గించాలని వెల్లడిస్తోంది. వాట్సాప్ ప్లస్, వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్ లాంటి యాప్ లు ఉపయోగించినట్లు తెలిస్తే…ఆ అకౌంట్లను నిషేధిస్తోంది. ఒక వాట్సాప్ అకౌంట్ ను ఎక్కువ మంది రిపోర్టు చేసినా…ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినా..ఆ అకౌంట్ ను వ్యాట్సాప్ బ్యాన్ చేసేస్తుంది. అంతేగాకుండా…స్మార్ట్ ఫోన్లకు ప్రమాదం కలిగించేలా ఉన్న లింక్స్..ఉండే ఫైల్స్ ను ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపినా.. ఆ వాట్సాప్ అకౌంట్లను నిషేధిస్తుంది.

Read More : Jawan Sai Teja : సాయితేజ మృతదేహం కోసం ఎదురు చూపులు

ఈ మధ్యకాలంలో ఫేక్ అకౌంట్ ఎక్కువగా షేర్ అవుతున్న విషయం తెలిసిందే. హింసను ప్రేరేపంచే విషయంలో వాట్సాప్ కఠినంగా ఉంటోంది. అలాంటి కంటెంట్ ను ఫార్వార్డ్ చేసినా బ్యాన్ చేస్తుంది. ఘర్షణలకు ప్రేరేపించే పోస్టులు, పిల్లలపై జరిగిన కంటెంట్ ప్రమోట్ చేస్తే…ఇక అంతే సంగతులు. సో…బ్యాన్ లేకుండా వెళ్లకుండా..పలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.