మెసేజ్ ఫార్వాడ్ చేస్తున్నారా? : వాట్సాప్‌లో 3 కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

లోక్ సభ ఎన్నికల వేళ.. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ మూడు కొత్త  ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది.

  • Published By: sreehari ,Published On : March 23, 2019 / 12:13 PM IST
మెసేజ్ ఫార్వాడ్ చేస్తున్నారా? : వాట్సాప్‌లో 3 కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

లోక్ సభ ఎన్నికల వేళ.. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ మూడు కొత్త  ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది.

లోక్ సభ ఎన్నికల వేళ.. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ 3 కొత్త  ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త బీటా అప్ డేట్ 2.19.80 ను తీసుకోస్తోంది. అవే.. ఫార్వడింగ్ ఇన్ఫో.. ఫ్రీక్వెంట్లీ ఫార్వెడెడ్ ఫీచర్ మరొకటి Short link లింక్ ఫీచర్. ఈ కొత్త బీటా అప్ డేట్ వెర్షన్ ద్వారా యూజర్లు తమ చాట్ బాక్సులో మెసేజ్ ను ఎన్నిసార్లు Forward చేశారో తెలుసుకోవచ్చు.
Read Also : పండుగ చేస్కోండి : జియో సెలబ్రేషన్ ప్యాక్ .. రోజుకు 2GB డేటా ఎక్స్‌ట్రా

ఇందులో రెండు కొత్త ఫీచర్లకు సంబంధించి లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటీ వెర్షన్ పై అందించనుంది. తమ ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ ను నియంత్రించే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. ఫార్వడ్ చేసే మెసేజ్ ఫేక్ న్యూస్ పై వాట్సాప్ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉంటోంది. ఇప్పటికే వాట్సాప్ తమ ప్లాట్ ఫాంపై Fake News ను నియంత్రించేందుకు Reverse Search Image ఫీచర్ ను తీసుకోచ్చింది.

5 సార్లు మాత్రమే అవకాశం : 
ప్రస్తుతం  ఫార్వడింగ్ ఇన్ఫో.. ఫ్రీక్వెంట్లీ ఫార్వెడెడ్ రెండు ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ ఫ్లాట్ ఫాంపై స్పెడ్ చేసే మెసేజ్ ను గతంలో ఎన్నిసార్లు ఫ్వార్వడ్ చేసారో ఈ ఫీచర్ల ద్వారా వెంటనే తెలిసిపోతుంది. 5 సార్లు కంటే ఎక్కువ సార్లు మాత్రమే ఫ్వార్వెడ్ చేయగలరు.. ఎన్నిసార్లు ఫార్వడ్ చేశారో కౌంటింగ్ నెంబర్ ను చాట్ బాక్స్ లో డిసిప్లే చేస్తుంది. WABetainfo తొలిసారి ఈ రెండు ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉండగా.. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ యాప్ 2.19.80 వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు ఫీచర్లు.. ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తుందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఆండ్రాయిడ్ Beta Version పై మాత్రం ఈ రెండు ఫీచర్లు ప్రత్యక్షమయ్యాయి. త్వరలో iOS డివైజ్ లతోపాటు అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. 

iOS యూజర్లకు ‘షార్ట్ లింక్’ ఫీచర్ 
ఐఓఎస్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఓఎస్ డివైజ్ సపోర్ట్ చేసే వాట్సాప్ యూజర్లకు షార్ట్ లింక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తోంది. బిజినెస్ బీటా వెర్షన్ 2.19.21.5 కొత్త అప్ డేట్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్.. రెగ్యులర్ ఆండ్రాయిడ్, Whatsapp Bussiness యూజర్లకు అందుబాటులో ఉంది. చివరిగా ఐఓఎస్ లో ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు WABetainfo నివేదిక తెలిపింది. 
Read Also : ఎడిట్ బటన్‌పై ట్వీట్ వార్: ట్విట్టర్‌కు వికీపీడియా బర్త్‌డే విషెస్