బీటా వెర్షన్ : వాట్సాప్‌లో మరో 3 కొత్త ఫీచర్లు ఇవే

ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్‌ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త  కొత్త ఫీచర్ల్లు, అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : September 20, 2019 / 02:20 PM IST
బీటా వెర్షన్ : వాట్సాప్‌లో మరో 3 కొత్త ఫీచర్లు ఇవే

ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్‌ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త  కొత్త ఫీచర్ల్లు, అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది.

ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్‌ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త  కొత్త ఫీచర్ల్లు, అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది. బీటా వెర్షన్ యాప్‌లో మొత్తం మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. అందులో ఒకటి హైడ్ మ్యూట్ స్టేటస్ అప్ డేట్స్, రెండోది ఫేస్ బుక్ పే, అలైన్ మెంట్ ఇండికేటర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాది జూలైలోనే WABetaInfo వాట్సాప్ లో మ్యూటెడ్ స్టేటస్ అప్ డేట్స్ హైడింగ్ ఫీచర్ పై వర్క్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫీచర్ ఫంక్షనాల్టీ పూర్తి కావడంతో ముందుగా బీటా యాప్ లో రిలీజ్ చేయనున్నట్టు బ్లాగ్ రిపోర్టులు తెలిపాయి. 

మ్యూటెడ్ స్టేటస్ అప్ డేట్స్ హైడ్ : 
యాప్ లో స్టేటస్ సెక్షన్ లో ఒక సపరేట్ సెక్షన్ గ్రే కలర్ లో కనిపించనుంది. అందులో మ్యూటెడ్ స్టేటస్ అప్ డేట్స్ కనిపిస్తాయని రిపోర్టులు పేర్కొన్నాయి. స్టేటస్ ట్యాబ్ లో పూర్తిగా మ్యూటెడ్ అప్ డేట్స్ సెక్షన్ హైడ్ కానుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.19.260 లోని వాట్సాప్ బీటా వెర్షన్ లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 

ఫేస్ బుక్ పే : 
వాట్సాప్ ప్లాట్ ఫాంపై రాబోయే మరో కొత్త ఫీచర్.. ఫేస్ బుక్ పే. ఇదొక కొత్త పేమెంట్ ఫీచర్. ఫేస్ బుక్ ఫ్యామిలీ యాప్స్ కోసం ప్రత్యేకించి ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకోస్తోంది. దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్ కూడా రిలీజ్ చేసింది. ఫేస్ బుక్ పేలో కొత్త పేమెంట్ మెథడ్ ఎలా యాడ్ చేయాలనేది ఇందులో ఉంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బేసిడ్ ప్లాట్ ఫాంపై ఈ ఫీచర్ డెవలప్ అవుతుంది. ఫేస్ బుక్ పే ఫీచర్ ప్రవేశపెట్టడానికి సంబంధించి అధికారిక సమాచారం లేదు.

అలైన్ మెంట్ ఇండికేటర్ : 
ఐఓఎస్ బేసిడ్ డివైజ్ ల్లో అలైన్ మెంట్ ఇండికేటర్ ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెట్టబోతోంది. ఈ ఫీచర్ ద్వారా టెక్స్ట్, ఎమోజీలు, స్టిక్కర్లు, ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్ లను నచ్చిన విధంగా సరిచేసుకోవచ్చు. మీడియా పోస్టులతో పాటు స్టేటస్ అప్ డేట్స్ లో కూడా ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఆపిల్ ఐఓఎస్ బేసిడ్ యాప్ వాట్సాప్ బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.