వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు : మీ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే.. నోటిఫికేషన్ వస్తుంది

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 09:48 AM IST
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు : మీ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే.. నోటిఫికేషన్ వస్తుంది

ప్రముఖ సోషల్ మెసేంజర్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకోస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఆధారిత వాట్సాప్ ప్లాట్ ఫాంపై డార్క్ థీమ్ తీసుకుస్తున్నట్టు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. సాధారణంగా వాట్సాప్‌లో కాంటాక్టుల ఆధారంగా ఇతరులకు మెసేజ్ చేసేందుకు వీలుంది.

కొంతమంది యూజర్లు పదేపదే మెసేజ్ పంపుతున్నారని వారిని బ్లాక్ లిస్టులో పెడుతుంటారు. ఇది కామన్. ప్రస్తుత వాట్సాప్‌లో కాంటాక్టులను బ్లాక్ లిస్టులో పెట్టిన విషయం ఇతరులకు తెలిసే అవకాశం లేదు. తమ నెంబర్ బ్లాక్ చేసినట్టు కూడా కనీసం ఎలాంటి నోటిఫికేషన్ కూడా వచ్చేది కాదు. కాంటాక్ట్ బ్లాక్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది. WABetaInfo రిపోర్టు ప్రకారం.. ఆండ్రాయిడ్ యాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. 

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో లేదు. కానీ, డెవలప్ మెంట్ దశలో ఉందని తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ కాంటాక్ట్ బ్లాక్ చేసిన ప్రతిసారి Chat boxలో ఒక Bubble కనిపిస్తుంది. ట్యాప్ చేసిన వెంటనే కాంటాక్ట్ Unblock అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ కాంటాక్టును బ్లాక్ చేశారంటూ మెసేజ్ వస్తుంది. ట్యాప్ Unblock అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

అవసరమైతే మళ్లీ Unblock చేసేందుకు వీలుంటుంది. కానీ, యూజర్ల ప్రైవసీ దృష్ట్యా వాట్సాప్.. కొంత గోప్యతను ఇస్తోంది. మీరు ఎవరి కాంటాక్టును బ్లాక్ చేసారు అనే విషయాన్ని ఇతరులకు నోటిఫై చేయదు. వారికి తెలిసే అవకాశం లేదు. కానీ, ఒకే విధానం ద్వారా తమను ఎవరూ బ్లాక్ చేశారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. 

ఒకవేళ మీ కాంటాక్టును ఎవరైనా బ్లాక్ చేస్తే.. వాట్సాప్ ప్రొఫైల్స్.. అబౌట్ సెక్షన్ యాక్సస్ చేసినప్పుడు బ్లాక్ చేసిన వారి ప్రొఫైల్ పిక్, లాస్ట్ సీన్ స్టేటస్ కనిపించదు. దీని బట్టి మీ  కాంటాక్ట్ బ్లాక్ చేసినట్టు తెలుసుకోవచ్చు. వాట్సాప్ మరో కొత్త ఫీచర్ కూడా ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ యాప్ గ్రూపు యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ తీసుకోస్తోంది. అదే.. కొత్త ‘గ్రూపుడ్ బ్లాక్‌డ్ కాంటాక్ట్’ ఫీచర్. దీని ద్వారా ఒక వేర్వేరు సెక్షన్లలోని బిజినెస్ గ్రూపు కాంటాక్టులను ఆటోమాటిక్‌గా బ్లాక్ చేయొచ్చు. 

బ్లాక్ చేసిన మొత్తం కాంటాక్టులను ఒకే జాబితాలో గ్రూపు కాంటాక్టులగా మారుస్తుంది. ఈ ఫీచర్ లో ప్రత్యేకత ఏంటంటే? యూజర్లు మ్యానివల్ గా తమ బిజినెస్ కాంటాక్టులను డిఫైన్  చేయలేరు. వాట్సాప్ మాత్రమే డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది.

బిజినెస్ సెక్షన్ లోని బ్లాక్ డ్ కాంటాక్టు లిస్టులో మీరు బ్లాక్ చేసిన కాంటాక్టులు కనిపిస్తాయి. ఇక్కడ పర్సనల్, బిజినెస్ అనే రెండు సబ్ సెక్షన్లు ఉంటాయి. పర్సనల్ గ్రూపు బ్లాక్ లిస్టు ఒక సెక్షన్ లో.. బిజినెస్ గ్రూపు బ్లాక్ కాంటాక్టు లిస్టు మరో సెక్షన్ లో కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో లేదండీ.. పెద్దగా కంగరు పడాల్సిన పనిలేదు.