వాట్సాప్ వదిలేసి.. ‘సిగ్నల్’ తెగ డౌన్‌లోడ్ చేసేస్తున్నారు.. నిలిచిపోయిన యాప్!

వాట్సాప్ వదిలేసి.. ‘సిగ్నల్’ తెగ డౌన్‌లోడ్ చేసేస్తున్నారు.. నిలిచిపోయిన యాప్!

working Stop Signal messaging platform : వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్‌డేట్ అడిగేసరికి… యూజర్లంతా కొత్త యాప్ సిగ్నల్ కు జంప్ అయిపోతున్నారు. వాట్సాప్ వదిలేసి సిగ్నల్ యాప్ డౌన్ లోడ్ చేసేసుకుంటున్నారు. మిలియన్ల మంది సిగ్నల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేసరికి కొత్త యాప్ సర్వర్లు పనిచేయడం లేదంట.. కొత్త మెసేజింగ్ ప్లాట్ ఫాం సిగ్నల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంకేతికపరమైన సమస్యలు తలెత్తినట్టు పేర్కొంది.


మిలియన్ల మంది కొత్త యూజర్లు ఒక్కసారిగా డౌన్ లోడ్ చేసుకోవడంతో సిగ్నల్ యాప్ పనిచేయడం ఆగిపోయిందని పేర్కొంది. కొన్ని గంటల పాటు మొబైల్, డెస్క్ టాప్ యాప్స్ పనిచేయడం ఆగిపోయాయి. కొంతమంది యూజర్లకు సిగ్నల్ యాప్ సాంకేతిక సమస్యలంటూ మెసేజ్ లు వస్తున్నాయి.


దీనికి సంబంధించి సిగ్నల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది.. రికార్డు స్థాయిలో సిగ్నల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడంతో సర్వర్లపై లోడ్ పడి మొరాయించాయని పేర్కొంది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్ డేట్ తప్పనిసరి చేయడంతో సిగ్నల్, స్వదేశీ టెలిగ్రామ్ ఎన్ క్రిప్టెడ్ యాప్ లకు మార్గం సుగమమైంది. ఇప్పటివరకూ వాట్సాప్ బాట పట్టినవారంతా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లపై ఆసక్తి చూపిస్తున్నారు.