వాట్సాప్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నోటిఫికేషన్లు శాశ్వతంగా Mute చేయొచ్చు!

  • Published By: sreehari ,Published On : July 29, 2020 / 11:01 PM IST
వాట్సాప్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నోటిఫికేషన్లు శాశ్వతంగా Mute చేయొచ్చు!

వాట్సాప్ యూజర్లకు నిజంగా గుడ్ న్యూస్.. అందులోనూ గ్రూపు చాట్, వ్యక్తిగత చాట్ యూజర్లంతా హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు. ఎందుకంటే.. ఇకపై గ్రూపు చాట్,  వ్యక్తిగత చాట్‌లో నోటిఫికేషన్లు మూగ బోనున్నాయి. ఇప్పటివరకూ వాట్సాప్ చాట్ బాక్సు‌లో నోటిఫికేషన్లను మ్యూట్ చేయడానికి లిమిట్ పిరియడ్ మాత్రమే ఉండేది. ఇకపై అలా కాదు.. ఎప్పటికీ మ్యూట్ లో పెట్టుకోవచ్చు.



సాధారణంగా చాలామంది వాట్సాప్ గ్రూపు లేదా వ్యక్తిగత చాట్ నోటిఫికేషన్లతో విసిగిపోతుంటారు. నిద్ర పోతున్న సమయంలోనూ ఎవరైనా ఏదైనా పంపగానే టింగ్ టింగ్ మంటూ నోటిఫికేషన్లు వస్తుంటాయి. దాంతో యూజర్లు చిరాకుపడుతుంటారు. వెంటనే నోటిఫికేషన్లను మ్యూట్ చేసేస్తుంటారు. అయితే ఇందులో మ్యూట్ సెట్ చేయాలంటే గ్రూపును శాశ్వతంగా మ్యూట్ చేయనివ్వదు.


ముందుగా 8 hours, 1 Week లేదా 1 Year పాటు మ్యూట్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది. కాంటాక్టులు, గ్రూపుల్లో నోటిఫికేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేసే సామర్థ్యంపై వాట్సాప్ బృందం వర్క్ చేస్తోంది. దీనికి సంబంధించి ఆధారాలను ఇప్పుడు సీరియల్ లీకర్ WABetaInfo కనుగొంది.

WhatsApp could finally let you mute those pesky group chats forever

నోటిఫికేషన్లను మ్యూట్ చేసేటప్పుడు 1 Year బదులుగా ‘Always’ ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. ఇప్పటివరకూ అయితే 8 గంటలు లేదా ఒక వారం లేదా ఒక ఏడాది పాటు మ్యూట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉండేది..



ఈ కొత్త ఫీచర్ సాయంతో శాశ్వతంగా నోటిఫికేషన్లను మ్యూట్ చేయొచ్చు. లేదంటే.. ఇందులో మరి ఏదైనా ఆఫ్షన్ తిరిగి ఎంచుకోవచ్చు. వాట్సాప్ నోటిఫికేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేసే ఆప్షన్ లేకపోవడంతో చాలామంది గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు.

ఫ్యామిలీ చాట్స్ వర్క్ గ్రూపుల నుంచి వెళ్లిపోతున్నారు. ఈ కొత్త ఫీచర్ ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందో కచ్చితమైన డేటా లేదు. అలాగే లేటెస్ట్ బీటాలో కూడా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రాలేదు.