WhatsApp DND Feature : వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త DND ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?

WhatsApp DND Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ వెబ్‌లో మీకు వాట్సాప్ కాల్ వచ్చిందా? వాట్సాప్‌లో అన్ని గ్రూప్ కాల్ నోటిఫికేషన్లతో ఇబ్బంది పడుతున్నారా?

WhatsApp DND Feature : వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త DND ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?

WhatsApp DND Feature _ WhatsApp rolling out new DND feature for web users, Here’s how it works

WhatsApp DND Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ వెబ్‌లో మీకు వాట్సాప్ కాల్ వచ్చిందా? వాట్సాప్‌లో అన్ని గ్రూప్ కాల్ నోటిఫికేషన్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసమే WhatsApp కొత్త ఫీచర్.. ఇప్పుడు Windowsలో WhatsApp కాల్‌ల నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసేందుకు మీకు సాయపడుతుంది.

మైక్రోసాఫ్ట్ స్టోర్‌ (Microsoft Store)లోని అధికారిక బీటా ఛానెల్ ద్వారా కొంతమంది బీటా టెస్టర్‌లకు కాల్స్ ఫీచర్ కోసం నోటిఫికేషన్‌లను నిలిపివేసేందుకు కొత్త ఫీచర్ రిలీజ్ చేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ (WhatsApp) Windows 2.2250.4.0తో కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. Windows యూజర్లు తమ WhatsApp యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా యాప్ Settingsలో నోటిఫికేషన్‌లను నిలిపివేసేందుకు కొత్త ఆప్షన్ పొందవచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇన్‌కమింగ్ వాట్సాప్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవద్దని అనుకుంటే వాటి కోసం నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయవచ్చు. ఎందుకంటే, చాలాసార్లు సిస్టమ్ DND ఫీచర్ నెట్‌వర్క్ అవాంతరాల కారణంగా పనిచేయదని గుర్తించాలి. Windows, macOS కోసం WhatsApp యాప్‌లలో కాల్ చేసేందుకు WhatsApp అనుమతిస్తుంది.

Read Also : WhatsApp Web : స్మార్ట్​ఫోన్​+ఇంటర్నెట్ లేకుండా ‘వాట్సాప్​ వెబ్​’ ఉపయోగించడం ఎలా?

వెబ్ బ్రౌజర్‌లో WhatsAppని ఉపయోగిస్తున్న యూజర్లు కాల్‌ చేయలేకపోవచ్చు. వాట్సాప్ వెబ్ (Whatsapp Web) కోసం డిసేబుల్ కాల్ నోటిఫికేషన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం విండోస్ బీటా టెస్టర్ల (Windows Beta Testers)కు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. MacOS యూజర్‌లతో సహా ఇతర యూజర్‌లు అప్‌డేట్ పొందడానికి కొంత సమయం వేచి చూడాల్సిందే.

WhatsApp DND Feature _ WhatsApp rolling out new DND feature for web users, Here’s how it works

WhatsApp DND Feature _ WhatsApp rolling out new DND feature for web users

విండోస్‌లో WhatsApp కాల్ నోటిఫికేషన్‌ను ఎలా నిలిపివేయాలంటే? :
* వెబ్ యూజర్లకు అందించిన ఈ ఫీచర్‌ ద్వారా కాల్‌ల కోసం నోటిఫికేషన్‌లను సులభంగా నిలిపివేయవచ్చు.
* WhatsApp వెబ్ యాప్‌ని ఓపెన్ చేయండి.
* Settings> Notification సెక్షన్‌కి వెళ్లండి.

నోటిఫికేషన్ బార్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే.. ‘when WhatsApp is closed’, మెసేజ్‌లు, కాల్స్ కోసం నోటిఫికేషన్‌లను టోగుల్ చేయండి. అలాగే OFF చేయండి. ఇదిలా ఉంటే, ‘Delete For Me’ మెసేజ్‌ను Undo చేయడానికి వినియోగదారుల కోసం కొత్త ‘Accidental Delete’ ఫీచర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ (Android), iOS యూజర్లందరికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 5 సెకన్ల వ్యవధిలో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

మీరు ఎవరైనా ఇతర యూజర్‌కు పొరపాటున పంపారా? ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ద్వారా ఆ మెసేజ్ వెంటనే Undo చేయవచ్చు. ఈలోగా, iOS యూజర్ల కోసం ‘Picture in Picture’ మోడ్‌ను తీసుకొచ్చేందుకు మెటా కూడా ధృవీకరించింది. ఈ ఫీచర్ ఇప్పటికే Android యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో iOSకి 2023లో అందుబాటులోకి వస్తుంది. పిక్చర్ మోడ్‌లో ఉన్న ఫొటోతో యూజర్లు వాట్సాప్ కాల్‌లో ఉన్నప్పుడు ఇతర యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!