WhatsApp New Features : వాట్సాప్‌లో 2GB వరకు ఫైల్స్ పంపొచ్చు.. గ్రూపులో ఎంతమంది చేరవచ్చంటే?
WhatsApp New Features : ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

WhatsApp New Features : ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. లేటెస్టుగా వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఎప్పటినుంచో వాట్సాప్ iMessage-వంటి ఎమోజి రియాక్షన్లపై వర్క్ చేస్తోంది. ఇప్పుడు WhatsApp ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఎమోజి రియాక్షన్లతో పాటు, వాట్సాప్ యూజర్లు మెసేజింగ్ యాప్‌లో 2GB వరకు ఫైల్‌లను పంపుకోవచ్చు. అలాగే.. వాట్సాప్ గ్రూప్‌లో గరిష్టంగా 512 మంది యాడ్ చేసేందుకు కూడా వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మొదట్లో ఫేస్బుక్ మాదిరిగానే వాట్సాప్‌లోనూ ఎమోజీ రియాక్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. వాట్సాప్ పోటీదారులైన సిగ్నల్, టెలిగ్రామ్, imessages ప్లాట్ ఫారమ్‌ల్లో ఎమోజి రియాక్షన్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి.. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వాట్సాప్ చాలా కాలంగా ఈ ఎమోజీ ఫీచర్లపై వర్క్ చేస్తోంది. బీటా టెస్టింగ్ సమయంలో టెస్టర్లు వాట్సాప్‌లో ఎమోజీ ఫీచర్‌ను గుర్తించారు. మెసేజింగ్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. యాప్ లేటెస్ట్ వెర్షన్లో ఎమోజీ రియాక్షన్లు అందుబాటులో ఉన్నాయని WhatsApp బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Whatsapp Finally Rolls Out Ability To Transfer Files Up To 2gb, Emoji Reactions And Other Features
2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు :
వాట్సాప్‌లో ఒకేసారి 2GB సైజులో ఉన్న ఫైల్‌లను పంపుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ ఫైల్లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉంటాయి. గతంలో వాట్సాప్ సెటప్ యూజర్లకు ఒకసారి 100MBని మాత్రమే ట్రాన్స్ ఫర్ చేయడానికి అనుమతించేది. రానురాను యూజర్లకు వీడియోలు, ఫొటోలను అధికంగా వినియోగిస్తుండటంతో వీడియోలు, ఫైల్‌లను వాట్సాప్ ప్లాట్ ఫారంపై ట్రాన్స్ ఫర్ చేయడం కష్టంగా మారింది. ఇప్పుడా ఆ సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ యూజర్లను 2GB ఫైల్‌ను పంపుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే Wi-Fi నెట్ వర్క్ ద్వారా 2GB ఫైళ్లను సులభంగా పంపుకోవచ్చునని పేర్కొంది. అయితే 2GB సైజు ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో యూజర్లకు తెలియజేసేందుకు అప్లోడ్ చేసే సమయంలో లేదా డౌన్లోడ్ చేస్తున్నప్పుడే పాప్ అప్ మెసేజ్ డిస్ప్లే అవుతుందని బ్లాగ్‌లో పేర్కొంది.
గ్రూపులో గరిష్టంగా 512 మంది జాయిన్ కావొచ్చు :
వాట్సాప్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. వాట్సాప్‌లో ఒక గ్రూప్‌లో 512 మంది వరకు యూజజర్లు చేరవచ్చు. మెసేజింగ్ యాప్ ప్రస్తుతం ఒక గ్రూప్‌కి 256 మంది వ్యక్తులను మాత్రమే యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆలస్యంగా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ప్రైవేట్, సురక్షితమైన కమ్యూనిటీలను నిర్మించడమే లక్ష్యంగా వాట్సాప్ పని చేస్తోంది.
Read Also : How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!
- WhatsApp New Feature : వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్
- WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక అందరూ వాడుకోవచ్చు..!
- How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!
- Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!
- WhatsApp Support : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. సపోర్ట్‌తో పేరుతో కొత్త తరహా మోసం
1ISB Anniversary: మే 26న ఐఎస్బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని: సీఎం కేసీఆర్నీ ఆహ్వానచిన డీన్
2Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..
3Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్
4IDRBT : ఐడీఆర్ బీటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలు
5Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
6Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?
7Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్
8Solar Night power : రాత్రిళ్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేయటానికి కొత్త టెక్నాలజీ తయారు చేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు
9Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
10Monkeypox Quarantine : బెల్జియంలో మంకీపాక్స్ బాధితులకు క్వారంటైన్ మస్ట్.. ఇదే ఫస్ట్ కంట్రీ..!
-
NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
-
Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు
-
Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!
-
Pakistan ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
-
Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
-
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!