కొత్త లుక్‌లో వాట్సాప్ గ్రూప్ కాల్స్.. చెక్ చేశారా? | WhatsApp group calls get a completely new look

WhatsApp Group Calls : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ లుక్ అదిరిందిగా!

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ తమ అప్లికేషన్ ప్లాట్ ఫాంపై కొన్ని మార్పులు చేసింది.

WhatsApp Group Calls : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ లుక్ అదిరిందిగా!

WhatsApp Group Calls : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ తమ అప్లికేషన్ ప్లాట్ ఫాంపై కొన్ని మార్పులు చేసింది. ప్రత్యేకించి గ్రూప్ కాల్స్ లుక్ పూర్తిగా మార్చేసింది. దీనికి సంబంధించి వాట్సాప్ కొత్త అప్ డేట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా గ్రూపు కాల్స్ లో మార్పులు చేసింది. గ్రూపు కాలింగ్ లుక్ మార్చడమే కాదు.. మునపటి ఫంక్షనాలిటీని కూడా మార్చింది. ఈ కొత్త ఫీచర్ లాంచ్ చేసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ కాల్స్ లోకి ఎంటర్ కావడం ఈజీ అయింది. అయినప్పటికీ.. ఈ కొత్త మార్పులతో టెక్నికల్ అవగాహన లేని చాలామంది యూజర్లలో గందరగోళాన్ని సృష్టించే అవకాశం లేకపోలేదు.

కొత్తగా వాట్సాప్ గ్రూప్ కాల్‌  :
ఇంతకుముందు.. వాట్సాప్ గ్రూప్ కాల్స్ కాల్ ప్రారంభమైనప్పుడు యూజర్ మరొక వ్యక్తిని కొనసాగుతున్న కాల్‌కు యాడ్ చేసే అవకాశం మాత్రమే ఉండేది. ఒకవేళ కాల్ మిస్ అయితే.. కాల్ మరొకరిని యాడ్ చేసేందుకు మార్గం లేదు. అదే ఈ కొత్త గ్రూపు కాల్ ఫీచర్ సాయంతో యూజర్లు ‘Calls’ ట్యాబ్ నుంచి మిస్ అయిన ఏదైనా గ్రూపు కాల్‌లను చూడొచ్చు. దానిపై క్లిక్ చేసి మళ్లీ గ్రూపు కాల్ లోకి యాడ్ చేయొచ్చు. యూజర్లు ఇప్పటికే కాల్‌లో ఎవరు జాయిన్ అయ్యారో తెలుసుకునే వీలుంది. కాల్‌లోకి ఎంట్రీ కాకముందు ఇంకా జాయిన్ కాలేదో కూడా చూడొచ్చు. ఈ కొత్త ఫీచర్ వాయిస్, వీడియో కాల్స్ రెండింటికీ అందుబాటులో ఉంది.

నావిగేట్ చేయాలంటే? :
వాట్సాప్ యూజర్ గ్రూపు కాల్ ప్రారంభించిన తర్వాత.. Invite మునుపటిలా గ్రూపు సభ్యులకు వెళ్తుంది. ఎవరైనా సభ్యుడు కాల్ పిక్ చేసిన వెంటనేవారికి మొత్తం స్క్రీన్‌ కనిపిస్తుంది. గ్రూపు కాల్‌లో ఎక్కువ మంది సభ్యులు ఫోన్‌ కాల్ పిక్ చేస్తే.. స్పెషల్ విండోస్‌లో ఒక్కొక్కరుగా కనిపిస్తారు. వాట్సాప్ కాల్ పిక్ చేయని గ్రూపు సభ్యులకు మాత్రం కాసేపు రింగ్ టోన్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రింగింగ్ ఆగిపోతుంది. అప్పుడు వారు ‘Calls’ ట్యాబ్‌లో కొనసాగుతున్న కాల్‌ను చూడగలరు.

ఇతర మార్పులేంటి? :
కాలింగ్ విండో పూర్తిగా మార్చేసింది. మ్యూట్ బటన్లు, కెమెరా మారడం, వీడియోను క్లోజ్ చేయడం.. కాల్ రిజక్ట్ చేయడం వంటి కంట్రోల్స్ అన్ని టాస్క్‌బార్‌లో ఉన్నాయి.

×