వాట్సాప్ వెబ్‌లో కొత్త ఫీచర్లు : ఇండియాలో వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు!

వాట్సాప్ వెబ్‌లో కొత్త ఫీచర్లు : ఇండియాలో వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు!

WhatsApp Voice and Video Call Feature On Web : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇండియాలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వాట్సాప్ తమ వెబ్ వెర్షన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. వాట్సాప్ యూజర్లు ఇప్పటినుంచి వెబ్ వెర్షన్‌లో వాయిస్ కాల్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్లను అన్ని వాట్సాప్ యూజర్లకు అతిత్వరలో నెమ్మదిగా ప్రవేశపెడుతోంది.

ఈ కొత్త ఫీచర్లకు సంబంధించి స్ర్కీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా లైవ్ లోకి రాలేదు. స్ర్కీన్ షాట్లలో వాట్సాప్ వెర్షన్ లో వాయిస్, వీడియో కాలింగ్ బటన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే Wabetainfo కూడా ఇదే ఫీచర్ ను మరిన్ని దేశాల్లో ప్రవేశపెడుతున్నట్టు ధ్రువీకరించింది. ప్రస్తుతానికి ఈ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. వాట్సాప్ బీటా ప్రొగ్రామ్ లో ఉన్నవారికి మాత్రమే అవకాశం ఉంది. ప్రత్యేకించి కొంతమంది యూజర్ల కోసమే వాట్సాప్ ఈ ఫీచర్ ప్రవేశపెడుతోంది. కానీ, ఈ బీటా ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అక్టోబర్ 2020లోనే ఈ వాట్సాప్ వెబ్ ఫీచర్ డెవలప్ మెంట్ గురించి మెసేజింగ్ యాప్ ప్రకటించింది. కొత్త ఫీచర్ రిలీజ్ కు సంబంధించి వాట్సాప్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.