వాట్సాప్ డెస్క్‌టాప్‌లో వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చేసిందోచ్!

వాట్సాప్ డెస్క్‌టాప్‌లో వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చేసిందోచ్!

WhatsApp introducing voice and video calling on desktop : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఫస్ట్ టైం వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. మొబైల్ యాప్ మాదిరిగానే డెస్క్ టాప్ వెర్షన్ లోనూ ఎన్ క్రిప్టడ్ సర్వీసును అందిస్తోంది. కంప్యూటర్ స్ర్కీన్ నుంచి వాయిస్ అండ్ వీడియో కాల్స్ చేసుకునేందుకు అనుమతినిస్తోంది.

ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ దీనికి సంబంధించి ఆప్షన్లను ఎలా ఎంచుకోవాలి? కోలిగ్స్, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కూడా కొత్త అప్ డేట్ ద్వారా అందిస్తోంది. మీ కంప్యూటర్ స్ర్కీన్ పై స్టాండెడ్ లోన్ విండోలో కూడా పోర్టరైట్, ల్యాండ్ స్కాప్ మోడ్ లో కూడా ఈజీగా వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ వినియోగించుకోవచ్చు.

కరోనా మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ఆన్ లైన్ వేదికగా కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో వాట్సాప్ సింగల్ డేలోనే వాయిస్, వీడియో కాల్స్ తో రికార్డు క్రియేట్ చేసింది.

1.4 బిలియన్ల మంది ఈ సర్వీసును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి ఈ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ ప్రారంభంలో ఒకరి నుంచి మరొకరికి మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తోంది. భవిష్యత్తులో గ్రూపు కాల్ ఫీచర్ కూడా తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది.