WhatsApp Screenshots : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్.. ఆ ఫీచర్‌‌తో ఇక అలా చేస్తే బ్లాక్ చేస్తోంది..!

WhatsApp Screenshots : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్. మీరు వాట్సాప్‌లో కొత్త వ్యూ వన్స్ ఫీచర్ (View Once Photos) ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై మీరు ఈ ఫీచర్ ఉపయోగించి స్ర్కీన్‌షాట్ తీసుకోలేరు. వాట్సాప్ కొంతకాలం క్రితమే ఈ వ్యూ వన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

WhatsApp Screenshots : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్.. ఆ ఫీచర్‌‌తో ఇక అలా చేస్తే బ్లాక్ చేస్తోంది..!

WhatsApp is now blocking screenshots for View Once photos

WhatsApp Screenshots : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్. మీరు వాట్సాప్‌లో కొత్త వ్యూ వన్స్ ఫీచర్ (View Once Photos) ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై మీరు ఈ ఫీచర్ ఉపయోగించి స్ర్కీన్‌షాట్ తీసుకోలేరు. వాట్సాప్ కొంతకాలం క్రితమే ఈ వ్యూ వన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లకు మరింత ప్రైవసీని అందించే లక్ష్యంతో కంపెనీ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

మీ WhatsApp చాట్ నుంచి అదృశ్యమయ్యే ఫోటోలు, వీడియోలను ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వాటిని పంపేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ, ప్లాట్‌ఫారమ్ రీసివర్ షేర్ చేసిన ఫొటో స్క్రీన్‌షాట్ తీసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ ఇప్పుడు ఆ ఫీచర్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ బీటా అప్‌డేట్‌లో.. వ్యూ వన్స్ ఫీచర్‌ (View Once Photos)ని ఉపయోగించి షేర్ చేసిన ఫోటోల స్క్రీన్‌షాట్‌ల సామర్థ్యాన్ని WhatsApp ఇప్పుడు బ్లాక్ చేస్తుందని WaBetaInfo పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. ఈ స్క్రీన్‌షాట్ తీసేందుకు ట్రై చేస్తే.. పంపినవారికి తెలియదని వాట్సాప్ ధృవీకరించింది. అయితే WhatsApp భద్రతా విధానంలో భాగంగా స్క్రీన్‌షాట్‌లను తీసుకునే సామర్థ్యాన్ని బ్లాక్ చేస్తుంది.

WhatsApp is now blocking screenshots for View Once photos

WhatsApp is now blocking screenshots for View Once photos

వ్యూ వన్స్ ఫీచర్‌ని ఉపయోగించి షేర్ చేసిన వీడియోల విషయానికొస్తే.. షేర్ చేసిన కంటెంట్‌ని చెక్ చేస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్‌ ఆప్షన్‌ను ప్లాట్‌ఫారమ్ యూజర్లను నిరోధిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఆటోమాటిక్‌గా వస్తుంది. అందుకు యూజర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవసీపై అవగాహన ఉన్న యూజర్లకు కొంత రిలీఫ్ కలిగిస్తుంది. రెండవ ఫోన్‌ని ఉపయోగించి వాట్సాప్ ఫొటోలను క్లిక్ చేయడం లేదా వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ని ఉపయోగించి ఏదైనా పంపే ముందు జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు సూచిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అదృశ్యమయ్యే మెసేజ్‌లను బ్లాక్ చేయడం లేదని గుర్తించుకోండి. ఎందుకంటే.. ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతం కేవలం ఒకసారి చూడగలిగే ఫొటోలు, వీడియోలకు మాత్రమే లిమిట్ అందిస్తోంది.

మెసేజింగ్ యాప్ స్టేబుల్ వెర్షన్‌కి ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో ప్రస్తుతానికి తెలియదు. వాట్సాప్ యూజర్ల మెసేజ్ ఫార్వార్డ్ చేసేందుకు, ఎగుమతి చేసేందుకు లేదా వ్యూ వన్స్ ఫొటో లేదా వీడియోను సేవ్ చేసేందుకు అనుమతించదు. ఒకసారి వాట్సాప్‌లో ఫోటోలు లేదా గ్యాలరీలో మీడియా సేవ్ కాదని గుర్తించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Aadhaar, PAN on WhatsApp: వాట్సాప్‌లో ఆధార్, పాన్, ఇతర పత్రాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి