Whatsapp New Feature : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఆప్షన్.. మీ స్టేటస్ హైడ్ చేయొచ్చు..!

Whatsapp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ప్రత్యేకించి iOS యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

Whatsapp New Feature : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఆప్షన్.. మీ స్టేటస్ హైడ్ చేయొచ్చు..!

Whatsapp Is Rolling Out A New Privacy Option For ‘last Seen’ Feature

Whatsapp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ప్రత్యేకించి iOS యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. ‘Last Seen’ ప్రైవసీ ఆప్షన్ ఫీచర్.. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ కొత్త ప్రైవసీ ఆప్షన్ యాడ్ చేస్తోంది. కొన్ని ప్రత్యేకమైన కాంటాక్టులకు ఈ మీ స్టేటస్ కనిపించకుండా Hide చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. WaBetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ఇప్పుడు లేటెస్ట్ iOS బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. Beta ప్రోగ్రామ్ Sign Up కోసం ఈ ఫీచర్‌ వినియోగించుకోవచ్చు.

కొంతమంది వాట్సాప్ కాంటాక్టులకు మాత్రమే Last Seen అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు వాట్సాప్‌లో చివరిగా ఎప్పుడూ ఉన్నారు అనేది మీ ఆన్ లైన్ స్టేటస్ ఇతరులకు తెలియకూడదని భావిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ New Privacy Option మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం WhatsApp మీ కాంటాక్టుల నుంచి Last Seen హైడ్ చేయడానికి 3 ఆప్షన్లను మాత్రమే అందిస్తోంది. ఇందులో మొదటి ఆప్షన్.. Last Seen ఆప్షన్.. ఇది ఎంచుకుంటే మీరు చూసింది (Last Seen) మాత్రమే అందరికి కనిపిస్తుంది.

Whatsapp Is Rolling Out A New Privacy Option For ‘last Seen’ Feature (1)

Whatsapp Is Rolling Out A New Privacy Option For ‘last Seen’ Feature 

రెండో ఆప్షన్.. My Contacts.. ఇది మీరు ఎంచుకుంటే మీ వాట్సాప్ కాంటాక్టులోనివారికి మాత్రమే కనిపిస్తుంది. మూడవ ఆప్షన్ కూడా ఉంది.. ఇది No One.. Last Seen ఆప్షన్ ఎవరూ చూడకూడదనకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు చివరిసారిగా వాట్సాప్ ఆన్ లైన్ లో ఎప్పుడు ఉన్నారు అనే స్టేటస్ ఎవరికి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఇప్పుడు మరో ఆప్షన్ టెస్టింగ్ చేస్తోంది. My Contacts Expect.. ఈ కొత్త ఆప్షన్ ద్వారా మీరు కొన్ని కాంటాక్టులను ఎంపిక చేసుకుని వారికి మాత్రమే ఈ Online Status Last Seen కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ తెలిపింది. అయితే బీటా యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ యాక్సస్ చేసుకోగలరని తెలిపింది. ఈ ఫీచర్ యాప్ వెర్షన్‌ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

Read Also : WhatsApp: వాట్సప్‌లో కమ్యూనిటీలు, గ్రూప్స్ కోసం మరో 4ఫీచర్లు